వర్షాల్లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. లేకపోతే చూపు కోల్పోతారు!

దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

వర్షం పడుతోంది అంటే కావాలని కొందరు.. తప్పక కొందరు తడుస్తూ ఉంటారు.

అయితే వర్షంలో తడిసినంతసేపు బాగానే ఉంటుంది.

కానీ, తెల్లారేసరికి జలుబు, రొంప పట్టుకుంటుంది.

వర్షాకాలంలో చాలామంది జలుబు, జ్వరం గురించే మాట్లాడుతూ ఉంటారు.

కానీ, కళ్లకు వచ్చే ఇన్ఫెక్షన్స్ గురించి పెద్దగా పట్టించుకోరు.

వర్షాకాలంలో కళ్లను అశ్రద్ధ చేస్తే ఇన్ ఫెక్షన్స్ కి చూపుకోల్పోయే ప్రమాదం ఉంటుంది.

వర్షాకాలంలో తరచుగా వచ్చే సమస్యలు కండ్లకలక, పొడి కళ్లు, స్ట్రై, ట్రాకోమా, కార్నియల్ అల్సర్స్ వస్తాయి.

అయితే ఇలాంటి ఇన్ ఫెక్షన్స్, కంటి సమస్యలు రాకుండా ఉండేందుకు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.

వర్షాకాలంలో మీ కళ్లను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఇన్ ఫెక్షన్స్ వేగంగా వస్తాయి.

కళ్లను ముట్టుకునే ముందే.. మీ చేతులను బాగా కడుక్కోవాలి.

సాధారణంగా కూడా కళ్లను ఎక్కువగా రుద్ద కూడదు. దురద అనిపిస్తే నీటితో కడుక్కోవాలి.

వర్షాకాలంలో ఈతకొలనలు, స్విమ్మింగ్ కి దూరంగా ఉంటే మంచిది.

కాంటాక్ట్ లెన్స్ షేరింగ్ వద్దు.. అలాగే కాంటాక్ట్ లెన్స్ తీసినప్పుడు రుద్దకండి. కార్నియా దెబ్బతింటుంది.

గమనిక:  ఈ విషయాలు కేవలం అవగాహన కోసం చెప్పినవే. ఏదైనా కంటి సమస్య ఉంటే వైద్యులను సంప్రదించడం మంచిది.