వర్షాకాలంలో తప్పక తినాల్సిన ఆహారం.. అశ్రద్ధ చేయద్దు..!

నైరుతి రుతుపవనాల వల్ల దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

ఎక్కువ వర్షాలు కురుస్తున్నాయి అంటే మనం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి అని అర్థం.

ఇప్పటివరకు ఎండలకు హడలిపోయిన ప్రజలు వర్షాలకు సేదతీరుతున్నారు.

అయితే వర్షాకాలం వస్తోంది అంటే.. అంటు వ్యాధులు కూడా వస్తున్నాయి అని అర్థం.

సీజనల్, అంటు వ్యాధులు వర్షాకాలంలోనే ఎక్కువ వ్యాపిస్తూ ఉంటాయి.

అలాగే వర్షాకాలంలో కలుషిత మంచినీరు, నిల్వ ఆహారం వల్ల ఎక్కువ రోగాల బారిన పడతారు.

వీటికి అదనంగా వర్షాకాలంలో మీరు మీ జీవనశైలిని మార్చుకోవాల్సి ఉంటుంది.

వర్షాకాలంలో మీ శరీరం తరచూ వేడిగా ఉండేలా చూసుకోవాలి.

మీరు ఎక్కవ బియ్యం, గోధుమ, బార్లీ వంటి వాటితో పప్పులను తీసుకోవాలి. అది కూడా మితంగానే..

ఈ సీజన్లో పాలు, పాల పదార్థాల జోలికి వెళ్లకపోవడం మంచిది. పెరుగు కన్నా మజ్జిగ మేలు చేస్తుంది.

నిమ్మకాయలు, ఎండు మిర్చి, తాజా అల్లాన్ని ఆహారంలో భాగం చేసుకుంటే జీర్ణవ్యవస్థ మెరుగ్గా ఉంటుంది.

కూరగాయలతో చేసిన సూప్ మంచిది. ఆకు కూరల వినియోగం తగ్గించండి.

వర్షాకాలంలో మరీ ఎక్కువ నీళ్లు తాగకండి. కంట్రోల్ గా తాగితే మంచిది.

రోజువారీ ఆహారంలో నెయ్యిని భాగంగా చేసుకోండి. ఆరోగ్యంగా ఉంటారు.

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం