వరల్డ్‌ టాప్‌ 5లో  మనోడు!

రికార్డులు, రివార్డులు ఓ క్రీడాకారుడి ప్రతిభకు కొలమానాలు కావు. అయితే అతడు మరింత రెచ్చిపోయి ఆడటానికి అవి బూస్ట్ లా  పనిచేస్తాయి.

ఇక ప్రపంచంలో ఎన్నో ప్రముఖ కంపెనీలు ప్రతీ సంవత్సరం అద్భుతమైన ఆటతీరు కనబర్చిన ఆటగాళ్ల జాబితాను విడుదల చేస్తూ ఉంటాయి.

తాజాగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన 'ప్యూబిటీ స్పోర్ట్స్' 2023 సంవత్సరానికి గానూ.. ప్రపంచంలోనే టాప్ 5 అథ్లెట్స్ లిస్ట్ ప్రకటించింది.

ఈ లిస్ట్ లో టీమిండియా నుంచి ఒకే ఒక్క ప్లేయర్ చోటు దక్కించుకున్నాడు..

మరి ఈ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారు? టీమిండియా నుంచి చోటు దక్కించుకున్న ఆ ప్లేయర్ ఎవరు? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఈ జాబితాలో టీమిండియా నుంచి ఒకే ఒక్కడు చోటు దక్కించుకున్నాడు. అతడే రన్ మెషిన్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ. 

వరల్డ్ లోని టాప్ 5 అథ్లెట్స్ జాబితాలో 5వ ప్లేస్ లో నిలిచాడు కోహ్లీ.

తాజాగా జరిగిన వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా అగ్రస్థానంలో నిలిచి ప్లేయర్ ఆఫ్ ది అవార్డు గెలుచుకున్నాడు కింగ్ కోహ్లీ. 

దీంతో పాటుగా సచిన్ 49 సెంచరీల ఆల్ టైమ్ రికార్డును బ్రేక్ చేసి.. ఔరా అనిపించాడు.

విరాట్ ఘనతను గుర్తించిన ప్యూబిటీ టాప్ 5లో గుర్తించి గౌరవించింది. అతడి ఫిట్ నెస్, డెడికేషన్, రికార్డులను పరిగణలోకి తీసుకుంది. 

విరాట్ తో పాటుగా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కూడా ప్యూబిటీ స్పోర్ట్స్ ఇయర్ అవార్డుకు నామినేట్  అయ్యాడు.

టాప్ 5 అథ్లెట్స్ లిస్ట్ లో అగ్రస్థానంలో అర్జెంటీనా ఫుట్ బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ ఉన్నాడు.

ఇక ఈ లిస్ట్ లో మరో ఫుట్ బాల్ దిగ్గజం క్రిసియానో రొనాల్డో రెండో స్థానంలో, బాక్సింగ్ దిగ్గజం మహ్మద్ అలీ మూడో ప్లేస్ లో నిలిచాడు. 

నాలుగో స్థానంలో అమెరికాకు చెందిన బాస్కెట్ బాల్ స్టార్ ప్లేర్ మైఖెల్ జోర్డాన్ నిలిచాడు.