కడుపులో అల్సర్స్ తగ్గాలంటే.. రోజు ఈ విధంగా చేయాలి

ప్రతిఒక్కరికి జీవనశైలిలో ఆహారపు అలవాట్లు మారడంతో పాటు ఒత్తిడి పెరగడం వల్ల జీర్ణకోశానికి వస్తున్న సమస్యల్లో అల్సర్స్ కూడా ఒకటి.

అయితే ఈ అల్సర్ అనేది..  ఆహారాన్ని జీర్ణం చేయడం కోసం కడుపులో ఉత్పత్తి చేసే అమ్లం సయానికి ఉత్పత్తి కాకపోవడం వల్ల ఏర్పడుతుంది.

దానితో పాటు  80 శాతం మందిలో  హెలికోబ్యాక్టర్‌ పైలోరీ అనే బ్యాక్టీరియా కూడా అల్సర్స్‌కు కారణమవుతుంది.

ఇలా జీర్ణాశయంలో వచ్చే ఈ అల్సర్ని గ్యాస్ట్రిక్ అల్సర్ అంటారు. అయితే ఈ అల్సర్ ను అధిగమించాలంటే ప్రతిరోజు ఇలా చేస్తే ఉపశమనం లభిస్తుంది.

ప్రతిరోజు యోగా, ధ్యానం, వంటి వాటివి చేయడం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఇలా చేయడం వలన అల్సర్ కూడా వచ్చే ఛాన్స్ ఉండదు.

ముఖ్యంగా కారం, ఉప్పు, మసాలాలు తక్కువగా ఉండే ఆహార పదార్థలను తీసుకోవాలి. ఇలా చేయడం వలన అల్సర్ నుంచి ఉపశమనం పొందవచ్చు.

వాటితో పాటు కాఫీ, టీలు ఎక్కువగా తాగకూండా తగ్గించడం మంచిది. ఇక వీలైనంత వరకు వాటికి దూరంగా ఉండటం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

ఇక పొగతాగడం, మద్యం సేవించడం వంటి అలవాట్లకు దూరంగా ఉంటే అల్సర్ సమస్య వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

అంతేకాకుండా.. క్రమం తప్పకుండా రోజూ ఒకే సమయానికి ఆహారం తీసుకోవడం వలన ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

వీటిపాటు ఆహారంలో మంచి డైట్ ను చేర్చుకోవడం, టైంకి నిద్రపోవడం వంటివి చేస్తే ఈ అల్సర్ సమస్య దరిదాపుల్లో చేరాదు.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం