ఈ లక్షణాలుంటే మీకు థైరాయిడ్ ఉన్నట్లే.. ఒకసారి చెక్ చేసుకోండి!

థైరాయిడ్ అనేది దీర్ఘకాలిక సమస్య అని అందరికీ తెలిసిందే.

ఒకసారి వస్తే.. అది అంత తేలికగా తగ్గదు.

పైగా ఈ థైరాయిడ్ వల్ల అనేక సమస్యలు వస్తాయి.

ఈ థైరాయిడ్ అనేది థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా విడుదల కావడం, తక్కువ విడుదల కావడం వల్ల వస్తూ ఉంటుంది.

ఈ థైరాయిడ్ రకాన్ని బట్టి మీ శరీరంలో మార్పులు వస్తూ ఉంటాయి.

సాధారణంగా కొందరికి థైరాయిడ్ వస్తే బరువు పెరుగుతారు.

కానీ, ఇంకొంతమంది థైరాయిండ్ వస్తే బరువు తగ్గిపోతారు.

ఈ థైరాయిడ్ సమస్యకు రెగ్యులర్ గా మెసిడిసిన్ తీసుకోవాలి.

అలాగే చాలా వరకు జాగ్రత్తగా ఉంటేనే ఈ థైరాయిడ్ సమస్య అదుపులో ఉంటుంది.

ఈ లక్షణాలు మీలో కనిపిస్తే.. కచ్చితంగా థైరాయిడ్ చెక్ చేసుకోండి.

తాజాగా బరువు పెరగడం, బాగా నీరసంగా అనిపిస్తూ ఉండటం, మలబద్దకం వంటివి కనిపిస్తాయి.

చర్మం పొడిబారడం, చలిగా అనిపించడం, ఏకాగ్రత లోపించడం కూడా కనిపిస్తుంది.

థైరాయిడ్ సమస్య వల్ల జ్ఞాపకశక్తి కూడా లోపిస్తుంది.

స్త్రీలలో పిరియడ్ ఇర్రెగ్యులర్ గా రావడం, సబ్ ఫెర్టిలిటీ కూడా ఈ థైరాయిడ్ లక్షణాలే.

పిల్లల్లో అయితే ప్యూబర్టీ ఆలస్యం, ఎదుగదల సరిగ్గా లేకపోవడం కనిపిస్తుంది.

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇలాంటి లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించిన తర్వాతే నిర్ధారమ చేసుకోండి.