మీకు తగిన రాశి వారు వీళ్ళే.. వీళ్ళని చేసుకుంటే మీ మాట వింటారు!

పెళ్లయ్యాక జీవితం బాగుండాలంటే రాసి పెట్టి ఉండాలని అంటారు.

రాశులని బట్టి పలానా అమ్మాయికి పలానా అబ్బాయి సరైన జోడి అని పెద్దలు నిర్ణయిస్తారు.

ఇవాళ మీ రాశికి మ్యాచ్ అయ్యే రాశి కలిగిన వ్యక్తి ఎవరు అనేది తెలుసుకోండి.

మార్చి 21-ఏప్రిల్ 19 మధ్య పుట్టిన మేష రాశి వారు, సెప్టెంబర్ 23-అక్టోబర్ 22 మధ్య పుట్టిన తులారాశి వారు.. ఈ జంట స్వర్గంలో నిర్ణయించబడిన జంటగా నమ్ముతారు.  

ఏప్రిల్ 20-మే 20 మధ్యలో పుట్టిన వృషభ రాశి వాళ్లకి, అక్టోబర్ 23 నుంచి నవంబర్ 21 మధ్య పుట్టిన వృశ్చిక రాశి వారికి మంచి లయ కుదురుతుందని చెబుతారు.

మే 21-జూన్ 20 మధ్య పుట్టిన మిధున రాశి వారు, నవంబర్ 22-డిసెంబర్ 21 మధ్య పుట్టిన ధనుస్సు రాశి వారు పెళ్లి చేసుకుంటే వాళ్ళ జీవితం సాఫీగా సాగిపోతుంది.

జూన్ 21-జూలై 22 మధ్య పుట్టిన కర్కాటక రాశి వారు, ఫిబ్రవరి 19-మార్చి 20 మధ్య పుట్టిన మీన రాశి వారు ఒకటైతే ఆ బంధం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది.

జూలై 23-ఆగస్టు 22 మధ్య పుట్టిన సింహ రాశి వారికి, జనవరి 20-ఫిబ్రవరి 18 మధ్య పుట్టిన కుంభ రాశి వారికి పెళ్లి సెట్ అయితే వారి లైఫ్ సెట్ ఇంక.   

ఆగస్టు 23-సెప్టెంబర్ 22 మధ్య పుట్టిన కన్య రాశి వారు, డిసెంబర్ 22-జనవరి 19 మధ్య పుట్టిన మకర రాశి వారు కలిస్తే తిరుగుండదని శాస్త్రాలు చెబుతున్నాయి.

ఈ కాంబినేషన్ ని సెట్ చేసుకుంటే ఒకరి మాట ఒకరు వింటారు. లైఫ్ బాగుంటుందని పెద్దలు చెబుతున్నారు.