ఈశాన్య భారతదేశంలో చూడదగిన నేషనల్ పార్క్స్ ఇవే

అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్ ఖడ్గ మృగములకు ప్రసిద్ధి చెందినది. దీనిని యునెస్కో వారు ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించారు. పక్షుల సాంక్చువరీ, అడవిమృగాల అభయారణ్యంగా గుర్తింపు పొందింది.

కజిరంగా నేషనల్ పార్క్:

మానస్ జాతీయ అభయారణ్యం యునెస్కో వారిచే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటింపబడింది. ఇందులో అస్సాం తాబేళ్ళు, కుందేళ్ళు, బంగారు లంగూర్లు మరియ్ పిగ్మీ హాగ్ లు ఉన్నాయి.

మానస్ నేషనల్ పార్క్:

నమ్దఫా జాతీయ ఉద్యానవనం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని చంగ్లంగ్ జిల్లాలోని మియో ప్రాంతంలో ఉంది. ఇందులో మిథున్, ఏనుగు, దున్న, పులులు, సాంబార్, హిమాలయాల్లో ఉండే నల్ల ఎలుగుబంట్లు, సింహాలు, ఎన్నో వృక్ష జాతులు ఉన్నాయి.

నమ్దఫా జాతీయ ఉద్యానవనం:

ఇది అస్సాంలో ఉంది. ఈ ఉద్యానవనంలో స్టంప్ తోకగల మెకాక్, హిమాలయ బ్లాక్, మలయన్ జెయింట్ ఉడుతలు వంటి ఎన్నో రకాల జంతువులను చూడవచ్చు.

డిబ్రూ సైఖోవా నేషనల్ పార్క్:

ఒరాంగ్ నేషనల్ పార్క్ భారతదేశంలోని అస్సాంలోని దర్రాంగ్ లో ఉన్న జాతీయ ఉద్యానవనం. ఇందులో ఖడ్గమృగాలు , పిగ్మీ హాగ్ , ఆసియా ఏనుగు , అడవి నీటి గేదె మరియు బెంగాల్ పులితో సహా వృక్షజాతులున్నాయి.

ఒరాంగ్ నేషనల్ పార్క్:

మౌలింగ్  జాతీయ ఉద్యానవనం అరుణాచల్ ప్రదేశ్ లో ఉంది. రెడ్ పాండాలకు ప్రసిద్థి.

మౌలింగ్ నేషనల్ పార్క్:

ఇది మేఘాలయలో ఉంది. ఆసియా బంగారు పిల్లి , బెంగాల్ టైగర్ , మార్బుల్డ్ క్యాట్ , అడవి నీటి గేదె , ఎర్ర పాండా ఏనుగులకు ఆవాసాలను అందిస్తుంది.

బల్ఫక్రమ్ నేషనల్ పార్క్:

కిబుల్ లామ్జావో జాతీయ పార్కు మణిపూర్ లో ఉంది. అనేక రకాల వైవిధ్యమైన జీవజాతులను ఇక్కడ చూడవచ్చును. ప్రపంచంలోనే నీటిపై తేలియాడే ఏకైక జాతీయ పార్కు గా ఇది రికార్డుల కెక్కింది. ప్రపంచంలో మరెక్కడా కనిపించని సంగయ్ అనే జాతి జింక ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది.

కిబుల్ లామ్జావో నేషనల్ పార్క్:

ఇది మిజోరాంలోని చంపై జిల్లాలో ఉన్న జాతీయ ఉద్యానవనం. ముర్లెన్‌లోని ఉష్ణమండల, పాక్షిక-సతత హరిత, ఉప పర్వతాల అడవులు అనేక రకాల వృక్షజాలం, జంతుజాలానికి నిలయంగా ఉన్నాయి.

ముర్లెన్ నేషనల్ పార్క్: