గుడ్డుతో కలిపి తినకూడని ఆహారాలు ఇవే.. తిన్నారా ఇక అంతే..!

గుడ్లు ప్రోటీన్‌లకు ఉత్తమ పవర్ హౌస్ అని.. గుడ్డు తింటే ఆరోగ్యానికి మంచిది అని తెలుసు.

గుడ్లలో ప్రొటీన్లు, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.

అయితే గుడ్డును కొన్ని రకాల ఆహారాలతో తింటే.. అనారోగ్యం బారిన పడతాం.

 కోడిగుడ్లతో ఏయే ఆహారపదార్థాలు తినకూడదు చూద్దాం..

సోయా మిల్క్ ఆరోగ్యానికి చాలా మంచిది.

అయితే దీనితో గుడ్లు కలిపి తింటే.. రెండింటిలో ప్రోటీన్‌ ఉన్నందున అవి జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి

అలానే గుడ్లు, పంచదార కలిపితే మంచిది కాదు.

ఈ రెండు కలిస్తే అమైనో ఆమ్లాలు విడుదలయ్యి కడుపు నొప్పి, జీర్ణ సమస్యలను కలిగిస్తుంది.

గుడ్లు, టీ కలిపి తీసుకుంటే.. టీ.. గుడ్డు ప్రొటీన్‌ను గ్రహించే శరీర సామర్థ్యాన్ని నాశనం చేస్తుంది.

ఎసిడిటీ, కడుపు నొప్పి, ఇతర జీర్ణ సమస్యలకు గురి చేస్తుంది.

మాంసాహార భోజనంతో గుడ్డు తినాలని చాలామంది అనుకుంటారు.

బిర్యానీలో కలిపి గుడ్డు తింటారు. దీని వల్ల శరీరంలోకి అదనపు ప్రోటీన్ చేరి అలసిపోయేలా చేస్తుంది.

చాలా మంది అరటి పండ్లు, గుడ్డు అల్పాహారంగా తీసుకుంటారు.

అయితే అరటిపండ్లు, గుడ్లు వంటి అధిక ప్రోటీన్ ఆహారాలు తింటే జీర్ణ సమస్యలు వస్తాయి.

అంతేకాక గుడ్లు అతిగా కూడా తింటే వివిధ రకాల సమస్యలు వస్తాయి. శరీరంలో వేడి పెరిగిపోతుంది.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం