వర్షాకాలంలో ఇమ్యూనిటీని పెంచే ఫుడ్స్ ఇవే.. ఆ సమస్యలన్నీ పరార్

వర్షాకాలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సీజనల్ వ్యాధులు వస్తుంటాయి.

Arrow

బ్యాక్టీరియా, వైరస్‌లు, ఫంగస్‌, ఇన్ఫెక్షన్‌ల కారణంగా అస్వస్ధతకు గురవుతుంటారు.

Arrow

దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతుంటారు.

Arrow

శరీరంలో రోగనిరోధక శక్తి ఉన్నట్లైతే వ్యాధుల భారిన పడకుండా ఉండొచ్చు.

Arrow

ఇమ్యూనిటీని పెంచే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఢోకా ఉండదంటున్నారు నిపుణులు.

Arrow

పోషకాలతో కూడిన ఫుడ్స్ తీసుకుంటే ఇమ్యూనిటి పవర్ ను పెంచుకోవచ్చు.

Arrow

యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్స్‌ అధికంగా ఉండే అల్లం ఆహారంలో భాగం చేసుకోవాలి.

Arrow

యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్స్‌ సమృద్ధిగా ఉండే కర్‌కుమిన్‌ అనే పదార్ధం పసుపులో ఉంటుంది.

Arrow

ఇది ఇమ్యూనిటీని బలోపేతం చేస్తుందని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు.

Arrow

యాంటిమైక్రోబల్‌, యాంటీవైరల్ పదార్ధాలు కలిగిన వెల్లుల్లి కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి

Arrow

పెరుగులోని ప్రోబయోటిక్స్ అనే బ్యాక్టీరియా ప్రేగుల ఆరోగ్యాన్ని కాపడాతాయి. ఇమ్యూనిటీని పెంచుతాయి.

Arrow

ఆకుకూరల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది.

Arrow

నట్స్, గింజల్లో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉండడం వల్ల వీటిని తీసుకుంటే ఇమ్యూనిటీని పెంచుతాయి.

Arrow

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం

Arrow