మంచినీళ్లు తాగినట్లు మందుతాగే వాళ్లున్న దేశాలు ఇవే!

చాలా మంది పార్టీల్లో, పండగల సమయంలో మద్యం సేవిస్తూ ఉంటారు.

కొంతమంది ప్రతి రోజూ తాగుతూ మద్యానికి బానిసైపోతారు.

అయితే.. కొన్ని దేశాల్లో అయితే బానిసలను మించి.. మద్యాన్ని మంచినీళ్లు తాగేస్తుంటారు.

 ప్రపంచంలోనే ఎక్కువ మందు తాగుతున్న ప్రజలు ఈ మూడు దేశాల్లో ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి.

 ప్రతి ఏటా మద్యపానం వల్ల 26 లక్షల మంది మరణిస్తున్నారని డబ్ల్యూహెచ్‌ఓ చెబుతున్నా.. ఈ మూడు దేశాల ప్రజలు ఆల్కహాల్‌ను విచ్చలవిడిగా తాగేస్తున్నారు.

అత్యధికంగా మద్యం వినియోగించే దేశాల్లో రొమేనియా మొదటి స్థానంలో ఉంది. 

ఈ దేశంలో ఒక పురుషుడు ఏటా దాదాపు 27.3 లీటర్ల మద్యం తాగుతాడు.

 రొమేనియా తర్వాత.. రెండో స్థానంలో జార్జియా ఉంది.

38 లక్షల జనాభా ఉన్న జార్జియాలో మద్యం ఉత్పత్తిలో ప్రపంచ ప్రసిద్ధి చెందింది.

మద్యం తయారు చేయడమే కాదు.. తాగడంలో కూడా జార్జియన్లు రికార్డు సృష్టిస్తున్నారు.

ఏటా జార్జియన్లు సగటున 14.33 లీటర్ల ప్యూర్‌ ఆల్కహాల్‌ తాగుతారు.

ఒక చెక్‌ రిపబ్లిక్‌ మూడో స్థానంలో ఉంది.

ఇక్కడి ప్రజలు సగటున ఏటా 13.29 లీటర్ల ఆల్కహాల్‌ సేమిస్తారు.

చెక్‌ రిపబ్లిక్‌లో బీర్‌ చాలా ఫేమస్‌. ఇక్కడి ప్రజలు బీర్‌ను చాలా ఇష్టంగా తాగుతారు.