వర్షాకాలంలో పసుపు పాలు తీసుకుంటే.. కలిగే ప్రయోజనాలు ఇవే

వర్షాకాలం ప్రారంభమైందంటే చాలు సీజనల్ వ్యాధులు ప్రభలుతుంటాయి.

ఆఫీసులకు, ఇతర పనుల కొరకు బయటికి వెళ్లినప్పుడు వర్షంలో తడిస్తే జలుబు, జ్వరం వస్తుంది.

వంటింట్లో వాడే పసుపు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది.

పసుపులో యాంటి సెప్టిక్, కర్కు మిన్ అనే పోషకాలు ఎక్కువ.

వర్షాకాలంలో వచ్చే వ్యాధులకు చెక్ పెట్టాలంటే పసుపు పాలు అద్భుతంగా పనిచేస్తాయంటున్నారు నిపుణులు.

పసుపు పాలల్లో కలిపి తీసుకుంటే అందులో ఔషధ గుణాలు రెట్టింపవుతాయని పలు పరిశోధనలు తెలుపుతున్నాయి.

పాలల్లో పసుపు కలిపి తీసుకోవడంతో ఊపిరితిత్తుల్లో కఫం కరిగిపోయి శ్వాస తీసుకోవడం తేలికవుతుంది.

ముక్కు దిబ్బడతో తల పట్టేస్తే వేడివేడిగా పసుపు కలిపిన పాలు తాగితే రిలీఫ్ పొందొచ్చు.

యాంటీ యాక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా గల పసుపు తల నొప్పి నుంచి రిలీఫ్ కలిగిస్తుంది.

పసుపు కలిపిన పాలు తాగితే అతి తక్కువ టైంలోనే రుతుస్రావ సమస్యలు తగ్గుతాయి.

నిద్రలేమితో బాధ పడుతున్న వారు పసుపు కలిపిన పాలు తీసుకుంటే అద్భుతంగా పనిచేస్తాయి.

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం