Tooltip

ఇవి గింజలు కాదు దివ్యాస్త్రాలు.. ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు వదలరు (పుచ్చ గింజలు)

ఇవి గింజలు కాదు దివ్యాస్త్రాలు.. ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు వదలరు (పుచ్చ గింజలు)

వేసవిలో ఎన్ని నీళ్లు తాగిన దాహం తీరదు. దాంతో నిపుణులు.. నీటి శాతం అధికంగా ఉండే పండ్లు తినమని సూచిస్తారు.

ఇక నీటి శాతం అధికంగా ఉండే పండు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది పుచ్చకాయ.

ఒకప్పుడు ఇది కేవలం వేసవిలో మాత్రమే దొరికేది.

అయితే ఇప్పుడు సీజన్‌లతో సంబంధం లేకుండా అన్ని కాలాల్లో లభిస్తుంది.

అయితే చాలా మంది పుచ్చకాయ తినేటప్పుడు గింజలను ఉమ్మేస్తారు.

మరి పుచ్చగింజలు తినకూడదా.. నిపుణులు ఏమంటున్నారంటే..

పుచ్చ గింజల్లో ప్రోటీన్, మెగ్నీషియం, జింక్, ఐరన్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి.

ఇవి రోగనిరోధక శక్తిని పెంచడమే కాక అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

అందుకే పుచ్చగింజలను దివ్యాస్త్రాలు అంటున్నారు నిపుణులు.

గింజలు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అకాల వృద్ధాప్యాన్ని నివారిస్తాయి.

ఎందుకంటే వీటిల్లో  విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కనుక.

జుట్టు రాలే సమస్య ఉన్న వారు పుచ్చ గింజలు తింటే.. దీన్నుంచి బయట పడవచ్చు అంటున్నారు.

పుచ్చగింజల్లో మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్‌లను ఉంటాయి.

ఆరోగ్యకరమైన కొవ్వులు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి.. గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

ఈ గింజల్లో ఉండే మెగ్నీషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

పుచ్చకాయ గింజలు టైప్-2 మధుమేహాన్ని నివారిస్తాయి.

ఈ గింజల్లో వివిధ ఖనిజాలు, విటమిన్ బి కాంప్లెక్స్ పుష్కలంగా ఉంటుంది.

అందుకే వీటిని తీసుకుంటే.. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

అంతేకాక పుచ్చ గింజలు బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని నివారించడంలో సహాయపడతాయి.

ఇది నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపర్చడంతో పాటు జీవక్రియను పెంచుతాయి.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం