Thick Brush Stroke

సమ్మర్ లో స్మార్ట్ ఫోన్ పేలిపోయే ప్రమాదం ఉంది! ఈ తప్పులు చేయకండి..

వేసవి కాలం ప్రారంభం కావడంతో ఎండలు అదిరిపోతున్నాయి.

ఈ వేసవిలో మన శరీరాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాము. 

మన శరీరాన్ని చూసుకున్నట్లే  మన స్మార్ట్ ఫోన్లను కూడా చూసుకోవాలి. 

గతేడాది వేసవిలో ఫోన్లు అకస్మాత్తుగా పేలిన ఘటనలు అనేక కేసులు నమోదయ్యాయి. 

ఈసారి కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండనుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

విపరీతమైన వేడి కారణంగా ఫోన్  వేడేక్కి పేలిపోయే అవకాశాలు ఉంటాయి.

ఫోన్ తరచుగా వేడెక్కుతుంటే ఉంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

స్మార్ట్ ఫోన్ ను  పర్సులో లేదా జేబులో పెట్టుకోవద్దు

బయటకు వెళ్లినప్పుడు ఫోన్‌ను మీ జేబులో, పర్సులో ఎక్కువసేపు ఉంచుకోవద్దు.

 వేసవి కాలం స్మార్ట్‌ఫోన్‌పై కవర్‌ను ఉంచడం కూడా మంచిది కాదు. 

 ఈ కవర్ కారణంగా హీటింగ్ సమస్యలు కలిగి ఫోన్ పేలిపోవచ్చు.

 ఫోన్ పేలడానికి బ్యాటరీ కూడా ఒక కారణమని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు.

 ఎక్కువ సేపు ఫోన్ కి ఛార్జింగ్ పెట్టడం వల్ల దాని బ్యాటరీపై భారం పడుతుందంట.

 ఎక్కువ సేపు ఫోన్ కి ఛార్జింగ్ పెట్టడం వల్ల దాని బ్యాటరీపై భారం పడుతుందంట.

 కాబట్టి వేసవిలో ఫోన్లను ఎంత జాగ్రత్త వాడుకుంటే అంతమేలని నిపుణులు చెబుతున్నారు.