Thick Brush Stroke

మేకపాలు తాగితే ఇన్ని లాభాలా.. అందుకే గాంధీ వీటిని సేవించేవారా!

పాలు అనగానే మనందరికి వెంటనే గుర్తుకు వచ్చేది గేదె, ఆవు పాలు మాత్రమే.

ఇప్పుడంటే జనాలు ఎక్కువగా ఈ రెండు పాలనే ఉపయోగిస్తున్నారు.

కానీ కొన్నాళ్ల క్రితం వరకు చాలా మంది ఇళ్లల్లో మేకపాలు వినియోగించేవారు.

గేదె, ఆవు పాలతో పోలిస్తే.. మేక పాలలోనే పోషకాలు అధికం.

ఈ పాలు తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు దూరమవుతాయని వైద్యులు అంటున్నారు.

మేకపాలలో ట్రైటోఫాన్‌ అనే ఎమినో యాసిడ్స్‌ పుష్కలంగా ఉండి శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ సక్రమంగా అందుతాయని చెబుతున్నారు

వాస్తవానికి, మేక పాలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి.

ఇది శరీరంలోని వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.

మేక పాలు తాగడం వల్ల డెంగ్యూ, ఇన్ఫ్లమేటరీ ప్రేగు వ్యాధి వల్ల వచ్చే వాపు నుంచి ఊరట లభిస్తుంది.

మానసిక ఆరోగ్యానికి మేక పాలు ఎంతో మేలు చేస్తాయి.

ఆందోళన, డిప్రెషన్, మరేదైనా మానసిక సమస్యతో బాధపడేవారు రోజుకి ఒక్కసారైనా మేకపాలు తాగితే ఎంతో మేలు అంటున్నారు.

మేక పాలు శరీరంలో సంతోషకరమైన హార్మోన్లను విడుదల చేసి.. మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి.

కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్ సమృద్ధిగా ఉన్న మేక పాలు రక్తహీనతను దూరం చేస్తుంది.

మేకపాలు తాగడం వల్ల శరీరం ఐరన్‌ను గ్రహించేలా చేస్తుంది.

అంతేకాక ఈ పాలు శరీరంలో ఎర్ర రక్త కణాలను కూడా పెంచుతాయి.

కీళ్ల నొప్పుల సమస్యతో బాధపడేవారికి మేకపాలు మంచి ఉపశమనం.

ఇందులో ఉండే కాల్షియం కీళ్ళు, ఎముకలను బలోపేతం చేసి.. నొప్పిని తగ్గించడంలో సాయం చేస్తుంది.

మేకపాలు ఆర్థరైటిస్ నొప్పుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి.

మేకపాలు ఆర్థరైటిస్ నొప్పుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం