గసగసాలతో  ఎన్నో లాభాలు.. తెలిస్తే అసలు వదిలిపెట్టారు..

సాధారణంగా గసగసాలను వంటలలలో ఉపయోగిస్తూ ఉంటారు.

ఇవి చూడడానికి  తెలుపు, నీలం రంగులలో అందుబాటులో ఉంటాయి.

ఇండియాలో మాత్రం.. తెల్ల గసగసాలను ఎక్కువగా ఉపయోగిస్తారు.

వీటి వలన ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..

బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.

గసగసాలలో ఉండే మాంగనీస్ మధుమేహాన్ని నియంత్రించడంలో ఎంతో మేలు చేస్తుంది.

గసగసాలలో ప్రొటీన్, ఫైబర్, ఎనర్జీ, కార్బోహైడ్రేట్స్, ఐరన్, కాల్షియం, జింక్, ప్రొటీన్ వంటి పోషకాలు ఎన్నో  ఉన్నాయి.

ఇక వీటి వలన గుండె, జీర్ణవ్యవస్థ, జుట్టు, చర్మం, నిద్రలేమి, మధుమేహం, ఎముకలు, నరాల సమస్యల లాంటి ఎన్నో సమస్యలు మాయమైపోతాయి.

అంతే కాకుండా స్త్రీలలో సంతానోత్పత్తికి గసగసాలు ఎంతో మేలు చేస్తాయి.

గసగసాలలో కాల్షియం ,కాపర్ ఎక్కువగా ఉండడం వలన.. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతో తోడ్పడుతుంది.

గసగసాలలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ పదార్థాలు ఉండడం వలన చర్మ సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి.

శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

గొంతు నొప్పి ,ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌లను నివారించడంలో  ఇవి బాగా ఉపయోగపడతాయి.

జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా గసగసాలు ఎంతో ఉపయోగపడతాయి.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం