చామ దుంప ఆకుతో బోలెడన్నీ ప్రయోజనాలు.. రోజు తీసుకుంటే ఈ జబ్బులు దరిచేరవు

చామ దుంపలను ఉడకబెట్టుకుని, కూర వండుకుని తింటుంటారు.

చామ దుంపల్లో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉన్నాయి.

చామ దుంపతో పాటు ఆకులు కూడా దివ్య ఔషదంగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు.

చామ ఆకులను రోజు తీసుకోవడం వల్ల అనేక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందంటున్నారు నిపుణులు.

చామ ఆకులలో విటమిన్లు ఎ, సి, బి- కాంప్లెక్స్‌, కాల్షియం, పొటాషియం, ఐరన్ పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

చామ ఆకులు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.

చామ ఆకులు శరీరంలోని వాపును తగ్గించడంలో సహాయపడతాయి.

హృదయ సంబంధ వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది.

చామ ఆకులలో విటమిన్ A పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చూపుకు మేలు చేస్తుంది.

చామ ఆకులలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు మేలు చేస్తుంది.

బరువు తగ్గడానికి చామ ఆకులు ఉపయోగకరంగా ఉంటాయి.

చామ దుంప ఆకులను తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం