పాలతో కలిపి గుమ్మడి గింజలు తినడం వలన కలిగే ప్రయోజనాలు తెలుసా!

సహజంగా గుమ్మడికాయ గింజలు అనేక పోషకాలను కలిగి ఉంటాయి. 

 ప్రతి 100 గ్రాముల గుమ్మడికాయ గింజల్లో 262 మిల్లీగ్రాముల వరకు మెగ్నీషియం ఉంటుంది

వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి శక్తిని అంది..  అనేక వ్యాధుల నుండి కాపాడుతుంది.

ముఖ్యంగా వీటిలో పాలీఅన్‌శాచురేటెడ్, మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి.

అయితే, వీటిని పాలలో నానపెట్టి తినడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. 

ఇవి ఎముకల ఆరోగ్యానికి మేలు చేసే కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం, జింక్‌లను అందిస్తాయి.  

ముఖ్యంగా కీళ్ల సమస్యలు, మోకాళ్ళ నొప్పుల  నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 

అంతేకాకుండా ఎముకలలో పెరుగుదల, బలం చేకూరడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. 

వీటిలో విటమిన్ ఇ, కెరోటినాయిడ్లతో సహా అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. 

ఈ యాంటీఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యానికి,  దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు ఎంతో ఉపయోగపడతాయి.