ఫారిన్ వెళ్లాలనుకుంటున్నారా? ప్రపంచంలో అత్యంత సురక్షితమైన దేశాలు ఏవో తెలుసా?

మనం ఎక్కడికైనా వెళ్లాలనుకున్నప్పుడు ఆ ప్రాంతం సురక్షితమైందా లేదా అని తెలిసి ఉండాలి.

వరల్డ్ వైడ్ గా నేరాలు ఎక్కువవుతున్న తరుణంలో సురక్షితమైన దేశాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రజలు ప్రపంచంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు వెళ్తుంటారు.

పెట్టుబడులు, వ్యాపారం కోసం, విదేశాల్లో స్థిరపడాలని చాలా మంది ఫారిన్ కు వెళ్తుంటారు.

ప్రపంచంలోని ఈ దేశాల్లో తక్కువ క్రైం రేట్, నాణ్యమైన జీవన విధానం, సమర్థవంతమైన ప్రభుత్వ పాలనను కలిగి ఉన్నాయి.

దేశాలు నివసించడానికి లేదా సందర్శించడానికి అనుకూలంగా ఉన్నాయి.

ఐస్ ల్యాండ్:

ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశం. తక్కువ క్రైం రేటును కలిగి ఉంది. ఉన్నతమైన జీవన ప్రమాణాలు, బలమైన సామాజిక ఐక్యత ఉంది.

డెన్మార్క్:

డెన్మార్క్ లో కూడా సురక్షితమైన వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా మహిళా ట్రావెలర్స్ కు అనుకూలం. తక్కువ క్రైం రేటును కలిగి ఉంది.

ఐర్లాండ్:

ఈ దేశంలో కూడా తక్కువ క్రైం రేటు ఉంది. జీవించడానికి సురక్షితమైన ప్రాంతం. ప్రశాంతతను కోరుకునే వారికి ఇది అనుకూలమైన దేశం.

న్యూజీలాండ్:

నివాసితులకు, సందర్శకులకు సురక్షితమైన దేశం న్యూజీలాండ్. తక్కువ క్రైం రేటును కలిగి ఉంది.

ఆస్ట్రియా:

ఇది కూడా సురక్షితమైన దేశం. సుందరమైన ప్రకృతి దృశ్యాలతో సందర్శకులను ఆకర్శిస్తుంది.

సింగపూర్:

ఇక్కడ కఠినమైన చట్టాలను అమలు చేస్తారు. భద్రత, వ్యక్తిగత భద్రతకు అధిక ప్రాధాన్య ఉంటుంది.

స్విట్జర్లాండ్:

అద్భుతమైన జీవన ప్రమాణాలను కలిగి ఉంది. బలమైన ఆర్థిక వ్యవస్థ, తక్కువ నిరుద్యోగిత రేటును కలిగి ఉంది. క్రైం రేట్ తక్కువ.

పోర్చుగల్:

వరల్డ్ లో సురక్షితమైన దేశాల్లో పోర్చుగల్ ఒకటి. పర్యాటకానికి, అక్కడ జీవించడానికి సురక్షితమైన వాతావరణాన్ని కలిగి ఉంది.

స్లోవేనియా:

సురక్షితమైన యూరోపియన్ దేశంగా పేరుగాంచింది స్లోవేనియా. ఇక్కడ భద్రతకు అధిక ప్రాదాన్యత ఉంటుంది.

మలేషియా:

సురక్షితమైన దేశాల్లో మలేషియా టాప్ టెన్ ర్యాంక్ పొందింది. తక్కువ క్రైం రేటు ఉంది. సామాజిక భధ్రతకు ప్రాముఖ్యతనిస్తారు.