ప్రొటీన్‌ అతిగా తీసుకుంటున్నారా..? మీ కిడ్నీలు జాగ్రత్త..!

కణజాలాల తయారీ, మరమ్మత్తు, దృఢత్వంలో ప్రొటీన్‌ కీలక పాత్ర పోషిస్తుంది.

జుట్టు ఆరోగ్యం విషయంలోనూ ప్రొటీన్‌ది ప్రధాన పాత్ర.

అయితే, ప్రొటీన్‌ ఆరోగ్యానికి మంచిదని కొంతమంది ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు.

ప్రొటీన్‌ ఆరోగ్యానికి చాలా మంచిది. 

అదే విధంగా అతిగా తీసుకుంటే అది ప్రమాదంగా మారుతుంది.

ప్రొటీన్‌ అధికంగా తీసుకుంటే అది కిడ్నీలను దెబ్బ తీస్తుంది.

జీర్ణవ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది.

మరి, మనం ఆరోగ్యం బాగా ఉండాలంటే.. ప్రొటీన్‌ ఎంత తీసుకోవాలి?

ప్రతి కిలోగ్రాము శరీర బరువుకు కనీసం 0.8 గ్రాముల ప్రొటీన్‌ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

వ్యాయామాలు చేసే వారు, ప్రతి రోజు కిలో శరీర బరువుకు 1.2 -1.7 గ్రాముల వరకు ప్రొటీన్‌ తీసుకోవచ్చు.