ఇండియాలో మోస్ట్ డేంజరస్ బీచ్ లు.. ఇక్కడికి వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాలి!

Arrow

హాలీడేస్ వస్తే చాలా మంది వెకేషన్స్ కు వెళ్లాలని చూస్తారు. కొందరైతే సెలవులతో సంబంధం లేకుండా ట్రిప్స్ ప్లాన్ చేస్తుంటారు.

Arrow

ఈ మధ్య కాలంలో యువతతో పాటు ఫ్యామిలీస్ కూడా ఎక్కువగా ట్రిప్స్ వెళ్లడం చూస్తూనే ఉన్నాం. అధికంగా ఆలయాలు, పర్వత ప్రాంతాలను సందర్శించడం తెలిసిందే. వీటితో పాటు బీచ్​లకు కూడా జనం పోటెత్తుతున్నారు.  

Arrow

ముఖ్యంగా వేసవిలో బీచ్ లకు సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటోంది. ఇందులో యువత సంఖ్య అధికంగా ఉంది.

Arrow

సముద్ర తీరాన ఇసుక తిన్నెల్లో కూర్చొని సూర్యుడ్ని చూస్తూ చల్లటి గాలుల్ని ఆస్వాదిస్తూ బీచ్​ల్లో ఎంజాయ్ చేస్తుంటారు సందర్శకులు. అక్కడే కొన్ని గేమ్స్ ఆడుతూ, ఫొటోలు దిగుతూ ఆ క్షణాలను ఎప్పటికీ గుర్తుండిపోయేలా మలచుకుంటారు.

Arrow

 మన దేశంలో ఎన్నో ప్రసిద్ధ బీచ్​లు ఉన్నాయి. సమ్మర్ రాగానే వాటికి జనాల తాకిడి ఓ రేంజ్​లో ఉంటుంది. అయితే ఇండియాలో ఫేమస్ బీచ్​లతో పాటు కొన్ని డేంజరస్ బీచ్​లు కూడా ఉన్నాయి.

Arrow

మన దేశంలో కొన్ని ప్రమాదకర బీచ్ లు ఉన్నాయి. ఇక్కడికి వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. మరి.. ఆ బీచ్ లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Arrow

డేంజరస్ బీచ్ ల్లో ఒకటి గుజరాత్ లోని డుమాస్ బీచ్. ఈ నల్ల మట్టి బీచ్ లో ఎంజాయ్ చేయడానికి రావొచ్చు. కానీ ఈ తీరంలో లోపలికి వెళ్తున్న కొద్దీ ప్రమాద తీవ్రత పెరుగుతుంది. అనూహ్యమైన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ నీళ్లలోకి దిగడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Arrow

కేరళలో పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్స్ లో కోవాలం ఒకటి. ఇక్కడి బీచ్ లకు కూడా జనాల తాకిడి ఎక్కువే. అయితే ఇక్కడి రాకాస అలలు మంచివి కాదని.

Arrow

చెన్నై అనగానే చాలా మందికి మరీనా బీచ్ గుర్తుకొస్తుంది. చాలా ఫేమస్ బీచ్ ఇది. కానీ ఇక్కడి బలమైన అలల తాకిడి వల్ల చాలా మంది నీట మునిగి ప్రాణాలు విడిచిన సందర్భాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

Arrow

గోవా అనగానే బీచ్ లు గుర్తుకొస్తాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇక్కడి కోల్వా బీచ్ లో చాలా జాగ్రత్తగా ఉండాలని ఎక్స్ పర్ట్స్ సూచిస్తున్నారు.

Arrow

చెన్నై అనగానే చాలా మందికి మరీనా బీచ్ గుర్తుకొస్తుంది. చాలా ఫేమస్ బీచ్ ఇది. కానీ ఇక్కడి బలమైన అలల తాకిడి వల్ల చాలా మంది నీట మునిగి ప్రాణాలు విడిచిన సందర్భాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

Arrow

గోవాలోని మరో ఫేమస్ బీచ్ అయిన కలంగట్​ బీచ్​ను సాధారణ సమయాల్లో సందర్శిస్తే ఇబ్బందేం లేదు. కానీ వర్షాకాలంలో ఇక్కడ జాగ్రత్తగా ఉండాలని, బలమైన అలల ప్రవాహానికి దూరంగా ఉండటం బెటర్ అని సూచిస్తున్నారు.

Arrow

గోవాలోని మరో ప్రఖ్యాత బీచ్ అయిన వెగటార్​లో నీటి ప్రవాహం అనూహ్యంగా మారుతూ ఉంటుంది. అందుకే ఇక్కడకు వెళ్లినవారు అలర్ట్​గా ఉండాలని హెచ్చరిస్తున్నారు.