ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ జంతువులు!

నీటి ఏనుగు

Arrow

ఈ ప్రపంచంలో 15 ప్రమాదకర జంతువులు ఉన్నాయి. వాటిలో మొదటిది నీటి ఏనుగు. నీటి ఏనుగు దాడి చేస్తే దాని పదునైన పన్ను శరీరంలో 2 అడుగుల లోతు వరకూ దిగుతుంది. ఒక అంగుళం లోతుకి 2 వేల పౌండ్ల నొప్పిని కలిగిస్తుంది. అంటే 2 అడుగులు దిగితే ఇంకెంత నొప్పి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇవి సబ్-సహారా ఆఫ్రికాలో ఉంటాయి. ఇవి కొలంబియా వరకూ ట్రావెల్ చేస్తాయి.

Arrow

బాక్స్ జెల్లీ ఫిష్

ఈ బాక్స్ జెల్లీ ఫిష్ కి సూదుల్లాంటి 15 పొడవాటి టెంటాకిల్స్ ఉంటాయి. ఇవి 10 అడుగుల పొడవు వరకూ పెరుగుతాయి. ఇవి ఎటాక్ చేసినప్పుడు గుండె, నాడీ వ్యవస్థ, స్కిన్ సెల్స్ తీవ్రంగా దెబ్బతింటాయి. వీటిలో విషం ఉన్నవి, విషం లేనివి కూడా ఉన్నాయి. అయితే విషం ఉన్న బాక్స్ జెల్లీ ఫిష్ దాడి చేస్తే మనిషి వెంటనే చనిపోతాడు. ఇది ఫిలిప్పీన్స్ దేశంలో ఏటా 20 నుంచి 40 మందిని చంపుతున్నాయి. ఇవి ఆస్ట్రేలియా ఉత్తర సముద్ర తీరం నుంచి ఫిలిప్పీన్స్ వరకూ ఉన్న సముద్ర భూభాగంలో ఉంటాయి.

కోన్ నత్త

Arrow

కోన్ నత్త పన్నులో కోనోటాక్సిన్ అనే విషం ఉంటుంది. ఇది దీని పంటితో దాడి చేస్తే నాడీ వ్యవస్థ దెబ్బ తింటుంది. ఇది పక్షవాతానికి దారి తీస్తుంది. ఈ కోన్ నత్తలు కరేబియన్ ఐలాండ్స్, హవాయి, ఇండోనేషియా దేశాల చుట్టూ ఉన్న నీళ్లలో జీవిస్తాయి. 

గోల్డెన్ పాయిజన్  డార్ట్ కప్ప

Arrow

ఈ కప్పలో బాట్రాచోటాక్సిన్ అనే విషం ఉంటుంది. 2 మైక్రో గ్రాముల విషంతో పది మందిని చంపగలదు. ఇవి కొలంబియాలోని పసిఫిక్ సముద్ర తీర ప్రాంతం చుట్టూ ఉన్న చిన్న చిన్న అడవుల్లో ఉంటాయి.

కేప్ బఫెలో

Arrow

ఇవి ఆరు అడుగుల పొడవు, ఒక టన్ను బరువు వరకూ పెరుగుతాయి. గంటకు 35 మైళ్ళ వేగంతో పరిగెడతాయి. ఆఫ్రికా ఖండంలోని  వేటగాళ్లను మిగతా జంతువులు చంపేదాని కంటే కూడా ఇవే ఎక్కువగా చంపుతున్నాయి. ఇవి గాయపడినా కూడా వెంటనే తిరిగి వెంటనే మళ్ళీ మామూలు స్థితికి రాగలవు. కదిలే వాహనాలను సైతం ఎటాక్ చేస్తాయి. ఇవి సబ్-సహారా ఆఫ్రికా, కెన్యాలోని మాసై మర ప్రాంతాల్లో ఉంటాయి.

ఇండియన్  స్కా స్కేల్డ్ వైపర్ పాము

Arrow

మోస్ట్ డేంజరస్ జంతువుల్లో ఇండియన్ స్కా స్కేల్డ్ వైపర్ పాము ఒకటి. ఇవి మిడిల్ ఈస్ట్, సెంట్రల్ ఏసియా, భారత ఉపఖండంలో ఉంటాయి.

ఫఫ్ఫర్ ఫిష్

Arrow

వీటిలో టెట్రోడాటాక్సిన్ అనే విషపూరిత పదార్థం ఉంటుంది. ఇది సైనైడ్ కంటే 1200 రెట్లు విషపూరితమైనది. ఇది దాడి చేస్తే నాలుక, పెదాలు చచ్చుబడిపోతాయి. వాంతులు, శ్వాసకోశ సమస్యలు, పక్షవాతం వస్తాయి. వెంటనే చికిత్స అందకపోతే మనిషి చనిపోతాడు.

ఇన్లాండ్ టైపాన్

Arrow

ఇన్లాండ్ టైపాన్ అనేది ఒక రకమైన పాము. దీని ఒక కాటు 100 మందిని చంపగలదు. మూర్ఛ, పక్షవాతం వస్తాయి. ఆర్గాన్స్ అన్నీ ఫెయిల్ అవుతాయి

బ్రెజిలియన్ వాండరింగ్ స్పైడర్

Arrow

ఇక సాలిపురుగుల్లా ఉండే ఇవి కుడితే 2 నుంచి 6 గంటల్లో మనిషి చనిపోతాడు. జ్వరం, వాంతులు, పక్షవాతం, ఊపిరితిత్తులు ఫెయిల్ అవ్వడం వంటివి జరుగుతాయి. 

వీటి తర్వాత ప్రమాదకర జంతువులుగా స్టోన్ ఫిష్, సాల్ట్ వాటర్ క్రొకోడైల్, ట్సెట్సే ఫ్లై, బ్లూ రింగ్డ్ ఆక్టోపస్, దోమ వంటివి ఉన్నాయి.

Arrow

స్టోన్ ఫిష్

 సాల్ట్ వాటర్ క్రొకోడైల్

ట్సెట్సే ఫ్లై

బ్లూ రింగ్డ్ ఆక్టోపస్

అయితే వీటన్నిటికంటే అత్యంత ప్రమాదకర జంతువు ఒకటి ఉంది. అది మనిషి. 10 వేల ఏళ్లుగా ఒకరినొకరు చంపుకుంటూ వందల కోట్ల మంది చావుకు కారణమయ్యారు. భూమిని ఎంత నాశనం చేయాలో అంతా నాశనం చేసి విధ్వంసం సృష్టిస్తున్నాడు.