ఆల్కహాల్ వల్ల లివర్ పాడైందా.. అయితే ఈ ఫుడ్ తో అంతా సెట్ చేయవచ్చు

ప్రస్తుతకాలంలో చాలామంది ఫ్యాటీ లివర్ సమస్యతో ఎక్కువగా బాధపడుతున్నారు.

ముఖ్యంగా ధూమపానం, మద్యపానం వంటి చెడు అలవాట్ల వల్ల ఈ కాలేయ సమస్య మరింత ఎక్కువగా పెరుగిపోతుంది.

అసలు ఈ కాలేయం ఆరోగ్యంగా లేకుంటే మెటబాలిక్ డిజార్డర్ తలెత్తుతుంది.

పైగా ఇది  టైప్ 2 డడయాబెటిస్ కు కారణం అవుతుంది.

ఇక సమస్య ఎక్కువగా  30 నుంచి 40 ఏళ్ల వయసు ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది.

అయితే ఈ ఫ్యాటీ లివర్ వ్యాధిని ప్రారంభ దశల్లో గుర్తించి.. మంచి ఆహారపు అలవాట్లను చేసుకుంటే  సమస్య నుంచి బయటపడవచ్చు.

ముఖ్యంగా కాలేయం రక్షించడానికి  ఆల్కహాల్, కూల్ డ్రింక్స్ తాగడం మొదట మానేయాలని వైద్యులు చెప్తున్నారు.

ఇక వాటికి బదులు అన్ని రకాల కొవ్వులు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు ఉండే ఫుడ్ ను తీసుకోవడం వలన కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.

అయితే కాలేయం ఆరోగ్యంగా ఉండలంటే  వోట్ మీల్ ను  రోజు తీసుకోవాలి.

దీనిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి, కాలేయం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

అలాగే ఆకుకూరలు క్రమం తప్పకుండా తీసుకుంటే కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.

ఇక రోజూ క్రమం తప్పకుండా ద్రాక్ష తో పాటు అరటిపండు, క్యాలీఫ్లవర్, బ్రకోలి తినడం ప్రారంభిస్తే.. కలేయం సమస్య మెరుపరిచి హెల్తీగా ఉంచుతుంది.

రోజూ వంటల్లో వంటనూనెకు బదులు ఆలివ్ ఆయిల్ వాడటం వలన కాలేయం సమస్య నుంచి బయటపడవచ్చు.

ముఖ్యంగా గ్రీన్ టీ రోజుకు 2 సార్లు తాగడం వల్ల లివర్ క్యాన్సర్ నుంచి కాపాడుకోవచ్చు.

కానీ, ఈ గ్రీన్ టీని అవసరానికి మించి ఎక్కువగా తాగకూడదు.

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం