చలికాలంలో టీ , కాఫీల వల్ల ఎన్ని లాభాలో తెలుసా?

చలికాలంలో వేడి పానీయాలు తాగేందుకు చాలా మంది ఇష్ట పడుతుంటారు.

ముఖ్యంగా శీతాకాలంలో టీ, కాఫీలు అంటే పిచ్చెక్కి పోతారు.

కొందరు రోజుకు కనీసం నాలుగైదు, సార్లైన  టీ, కాఫీలు తాగేందుకు ఇష్టపడతారు.

ప్రకృతిని, ఆహ్లాదాన్ని అనుభూతి చెందేందుకు టీ తాగుతూ సేదతీరుతారు.

అయితే ఈ టీ లేదా కాఫీల వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం.

కాఫీ లేదా టీ తాగడం కారణంగా మైండ్ రిలాక్స్ అవుతుంది.

కాఫీలో ఉండే కెఫిన్ మెదడులోని నరాలు ఉత్తేజానికి గురయ్యేలా చేస్తాయి.

ఉదయాన్నే ఒక కప్పు కాఫీ లేదా టీ తాగితే చాలు ఆ రోజంతా ఎంతో యాక్టివ్ గా పనిచేస్తారు.

శీతాకాలంలో టీ, కాఫీ తాగడం వల్ల జలుబు, దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్లు రావని నిపుణులు చెబుతున్నారు

అలానే టీలో ఉన్న ఆయుర్వేద మూలికలు వల్ల జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడుతుంది.

కాఫీ, టీ తాగడం వల్ల కడుపులోని వికారం సమస్యను నివారించ వచ్చు.

అల్లం టీ తీసుకుంటే మనకు విశ్రాంతిని, ప్రశాంతతను కలిగిస్తుంది.

అలానే చలికాలంలో వేడి టీని తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన ఉష్ణోగ్రత అందుతుంది.

అలానే టీ,కాఫీల కారణంగా రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణలు చెబుతున్నారు.

వేడిగా కాఫీ, టీ ఏదైనా కడుపులోకి వెళ్లడం ద్వారా ఇంద్రియాలను ఉత్తేజం చెందుతాయి.

టీ, కాఫీలు తాగడం కారణంగా బద్దకం, సోమరితనం, నిద్రను తమ కంట్రోల్ లో  ఉంచుకోవచ్చు.

అయితే అతిగా తాగడం మాత్రం మంచి కాదని  ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.