రాత్రి తోమాల్సిన గిన్నెలు పొద్దున్నే తోముతున్నారా? ఎంత డేంజరో తెలుసుకోండి

చాలా మంది రాత్రి తిన్న తర్వాత వంట పాత్రలను మరుసటి రోజు పొద్దున్న తోముతుంటారు.

ఐతే ఇలా చేయడం చాలా ప్రమాదం అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సామాన్లు ఎక్కువ సేపు కడగకుండా ఉంటే ఆ సామాన్ల మీద బ్యాక్టీరియా ఎక్కువగా ఏర్పడుతుంది.

బ్యాక్టీరియా సింకు నుంచి వంట గదిలోని ఇతర ప్రదేశాలకు వేగంగా వ్యాప్తి చెందుతుంది.

అందుకే రాత్రి తిన్న తర్వాత ఎంత త్వరగా తోమితే అంత వేగంగా మీరు బ్యాక్టీరియా వ్యాప్తిని ఆపవచ్చు.

రాత్రంతా నీటిలో లేదా సబ్బు నీటిలో నానబెట్టి.. పొద్దున్న కడగడం ఈజీ అనుకుంటారు. కానీ రాత్రి అప్పటికప్పుడు కడగడమే సులువు.

నానబెట్టడం వల్ల చిన్న చిన్న సూక్ష్మక్రిములు చేరి అవి వంట గదంతా వ్యాపిస్తాయి.

సూక్ష్మక్రిములు మురికి పాత్రల మీద , సబ్బు నీటిలో హ్యాపీగా జలకాలాడుతుంటాయి. ఇది చాలా డేంజర్.

ఆ క్రిములు చాకుల మీద లేదా ఇతర ప్రాంతాల్లో పాకుతూ అనారోగ్యానికి కారణమవుతాయి.

జీర్ణాశయ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఎప్పుడు తిన్న గిన్నెలు అప్పుడు తోముకుంటే ప్రశాంతంగా ఉండచ్చు.

దీని వల్ల పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. పైగా వంటగది కూడా శుభ్రంగా ఉంటుంది.