గుండె ఆరోగ్యం కోసం ఐదు వ్యాయామాలు! అవేంటంటే..

ఈ రోజుల్లో హార్ట్ ఎటాక్, గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి.

గుండెకు సంబంధించిన సమస్యలు వయసుతో సంబంధం లేకుండా చాలామందిలో కనిపిస్తున్నాయి.

ప్రస్తుత కాలంలో గుండెను కాపాడుకోవడం ఎంతో ముఖ్యం.

గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడంలో వ్యాయామం కీలకపాత్ర పోషిస్తుంది.

ఐదు రకాల వ్యాయామాలతో గుండెపోటు ముప్పును తగ్గించుకోవచ్చు.

మరి.. ఆ ఐదు రకాల వ్యాయామాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

రోజుకు కనీసం 30 నిమిషాల పాటైనా వాకింగ్ చేయాలి.

రోజూ కొద్దిదూరం సైక్లింగ్ చేయడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

ట్రెడ్ మిల్ మీద్ జాగింగ్, రన్నింగ్ లాంటివి చేస్తే మంచింది.

అలాంటి వ్యాయామాల వలన హార్ట్ కు మేలు జరుగుతుంది.

గుండె బలోపేతానికి దోహదం చేసే మరికొన్ని వ్యాయామాలను రోజూ చేయాలి.

సాధారణ నడక కంటే కొంచెం వేగంగా నడవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అలా కాస్తా వేగంగా నడవడం వలన మన శరీరంలోని కొలెస్ట్రాల్, రక్తపోటు తగ్గుతుంది.

బ్రిస్క్ వాకింగ్ అనేది మన గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

అయితే ఈ వ్యాయామాలు అతిగా మాత్రం చేయవద్దు.

నిపుణుల పర్యవేక్షణలో, వారి సూచనల మేరకు చేయడం మంచిది.