చలికాలంలో ఇలా చేస్తే ఒత్తైన కురులు, నిగనిగలాడే ముఖం మీ సొంతం..

చలికాలంలో శరీరం విపరీతంగా పొడిబారిపోతుంది.

జుట్టు, చర్మం కూడా బాగా డ్యామేజ్‌ అవుతాయి. 

ఈ కాలంలో నూనె పెట్టకపోతే జుట్టు మృదుత్వం కొల్పోతుంది.

వెంట్రుకలు బలహీనపడతాయి. అలా కాకుండా ఉండాలంటే..

ఒత్తైన కురుల కోసం కొబ్బరి పాలలో కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి

ఈ పాలను జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించాలి.

గంట తర్వాత మైల్డ్‌షాంపుతో తలస్నానం చేయాలి.

ఇలా వారానికి 2,3 సార్లు చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

జిడ్డుతత్వం కురులు ఉన్నవారికి కొబ్బరిపాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి.

అలానే మెరిసే ముఖం కోసం.. ఎండబెట్టిన కమలాతొక్కలను తీసుకోవాలి.

వాటిని దోరగా వేయించి మెత్తటి పొడిలా చేయాలి.

పొడిలో టీస్పూను పసుపు, రెండు టీస్పూన్ల శనగపిండి, కొద్దిగా నీళ్లుపోసి కలపాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు ప్యాక్‌లా వేసి ఆరనివ్వాలి.

ఇరవై నిమిషాల తరువాత తడిచేతులతో రుద్ది కడిగేయాలి. 

దీనివల్ల ముఖంపై మృతకణాలు, ట్యాన్‌ తొలగిపోయి కాంతివంతంగా మారుతుంది.

వారానికి రెండుసార్లు ఈ ప్యాక్‌ వేసుకుంటే ముఖం మెరుస్తుంది.