రెండు రోజుల్లోనే ఇల్లు నిర్మించే టెక్నాలజీ!

ఇల్లు నిర్మించాలంటే కనీసం  6 నెలల నుంచి ఏడాది సమయం పడుతుంది.

కానీ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీతో కేవలం రెండే రెండు రోజుల్లో ఇంటిని కట్టేయవచ్చు.

దీని కోసం మేస్త్రీలు, కూలీలు అవసరం లేదు.

జస్ట్ ల్యాప్ టాప్ ద్వారా 3డీ డిజైన్ ని ఇచ్చి ఆపరేట్ చేస్తే చాలు దానికదే ఇంటిని నిర్మించేస్తుంది.

దాని పేరు హ్యాడ్రియాన్ ఎక్స్ రోబో. దీన్ని ఎఫ్బీఆర్ అనే రోబోటిక్స్ కంపెనీ తయారు చేసింది.

ఇది ఒక రోబోటిక్ ట్రక్. 3డీలో ఇంటికి సంబంధించిన ప్లాన్ ని ఇస్తే దానికి తగ్గట్టు ఇటుకలను పేర్చుకుంటూ వెళ్ళిపోతుంది.

మొదటి రోజు గోడలను కట్టి.. ఆ తర్వాత రోజు పూర్తి ఇంటిని నిర్మించేస్తుంది.  

దీన్ని ఆస్ట్రేలియా నుంచి అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రానికి తీసుకొచ్చి ప్రయోగం చేశారు.

ఆ ప్రయోగం సక్సెస్ అయితే 5 నుంచి 10 అంతస్తుల బిల్డింగ్స్ ని నిర్మించనున్నారు.

రోబోటిక్ ట్రక్ కి ఒక ప్యాలెట్ ఉంటుంది. అందులో ఇటుకలను లోడ్ చేయాలి.

ఆ ట్రక్ కి ఉన్న ఆర్మ్ ఇటుకలకు ఒక సిమెంట్ లాంటి మిశ్రమాన్ని చేర్చి ఒక్కో ఇటుకను పేర్చుతూ ఇంటిని పూర్తి చేస్తుంది.

ట్రక్ ఎత్తు 105 అడుగులు ఉండడం వల్ల పెద్ద పెద్ద అంతస్తులను సైతం సులువుగా నిర్మించగలదు.

పైగా బిల్డింగ్ మెటీరియల్, సమయం అనేవి వృధా అవ్వవు. అమెరికాలో వర్కవుట్ అయితే మిగతా దేశాలకు ఈ టెక్నాలజీని తీసుకొచ్చే అవకాశం ఉంది.