ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే రక్తహీనత సమస్య దూరం

రక్తంలో హీమోగ్లోబిన్‌, ఎర్ర రక్త కణాల సంఖ్య తక్కువగా ఉండటాన్ని రక్తహీనతగా పిలుస్తారు.

రక్తంలోని హీమోగ్లోబిన్‌ మన శరీరంలోని అన్ని భాగాలకు, కణాలకు ఆక్సిజన్‌ను అందిస్తుంది.

ఆహారంలో సరిపడా ఐరన్‌ తీసుకోకపోతే హిమోగ్లోబిన్ లోపిస్తుంది. ఎర్ర రక్త కణాలు తగ్గిపోతాయి.

హిమోగ్లోబిన్‌ లెవల్స్‌ పెంచడానికి ఈ ఫుడ్స్ తీసుకుంటే రక్తహీనత సమస్యకు చెక్ పెట్టొచ్చంటున్నారు నిపుణులు.

అలివ్‌ విత్తనాల్లో ఐరన్‌తో పాటు కాల్షియం, ఫోలిక్ యాసిడ్, విటమిన్‌ సి వంటి పోషకాలు ఉంటాయి.

అలివ్‌ విత్తనాల్లోని ఫోలిక్ యాసిడ్ ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది.

దానిమ్మలో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది రోజూ తీసుకుంటే రక్తహీనత దూరం అవుతుంది.

పాలకూరలో ఎర్రరక్త కణాల ఉత్పత్తికి కీలక పాత్ర పోషించే ఫోలేట్‌, విటమిన్ సి అధికంగా ఉంటాయి.

​ఐరన్‌ లోపంతో బాధపడేవారు రోజూ ఓ గుడ్డు తీసుకుంటే రక్తహీనత సమస్య నుంచి బయటపడొచ్చు.

కమల పండులో ఐరన్‌ సమృద్ధిగా ఉంటుంది. దీన్ని ఆహారంగా తీసుకుంటే రక్తహీనత సమస్యకు చెక్ పెట్టొచ్చు.

ఆహారంలో బీన్స్, పప్పుధాన్యాలు ఉన్నట్లయితే మనలో రక్తహీనత సమస్య రాదని నిపుణులు చెబుతున్నారు.

నల్ల నువ్వుల్లో ఐరన్ అధికంగా ఉంటుంది. అనీమియాను తగ్గించడంలో తోడ్పడుతుంది.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం