ఏసీ పేలకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి!

ఈ మధ్య కాలంలో ఏసీలు బాగా పేలుతున్న సంఘటనలు చూసాం. పలు చోట్ల ఏసీలు పేలడం వల్ల అగ్ని ప్రమాదాలు సంభవించాయి. 

చాలా మంది ఏసీల విషయంలో కంగారు పడుతున్నారు.

అసలు ఏసీ ఎందుకు పేలుతుంది? పేలకుండా ఉండాలంటే ఏం చేయాలి?

ఏసీ యూనిట్ ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి.

రెగ్యులర్ మెయింటెనెన్స్ చేయిస్తూ ఉండాలి. 

ఫిల్టర్లను శుభ్రం చేస్తూ ఉండాలి. రిఫ్రిజిరెంట్ లీక్ అవ్వకుండా చూసుకోవాలి.

 మీ ఏసీ కనుక మొత్తం మీద 600 గంటల పాటు పని చేస్తే కనుక సర్వీసింగ్ చేయించడం అనేది చాలా ముఖ్యం.

ఏసీకి వెంటిలేషన్ చాలా ముఖ్యం. దీని వల్ల ఏసీ హీట్ ఎక్కకుండా ఉంటుంది.

బ్రాండెడ్ ఏసీలే కొనాలి. అలానే ఏసీ రిపేర్ అప్పుడు అందులో భాగాలను బ్రాండెడ్ వాటితోనే రీప్లేస్ చేయించాలి. 

ఏసీ నుంచి ఎప్పుడూ లేని విధంగా సౌండ్ వస్తున్నా, స్మెల్ వస్తున్నా వెంటనే ఆఫ్ చేయాలి. 

ఏసీ నుంచి పొగలు వస్తే కనుక నీటిని చల్లకండి. టెక్నీషియన్ ని సంప్రదించండి.

రోజులో ప్రతి 2 గంటలకు ఒకసారి 5, 10 నిమిషాల పాటు ఏసీని ఆఫ్ చేయాలి.

ఏసీలు వాడేవారు ఇంట్లో ఫైర్ సేఫ్టీ పరికరాలు, స్మోక్ డిటెక్టర్లని పెట్టుకుంటే ప్రమాదం నుంచి బయటపడచ్చు.