మహిళలో మెనోపాజ్ దశలో  వచ్చే కష్టాలకు.. 30 ఏళ్ళ నుంచే ఇలా జాగ్రత్తలు తీసుకోండి.

సాధారణంగా మహిళలలో యాభై వయస్సుకు చేరుకున్న తర్వాత  మెనోపాజ్ దశ స్టార్ట్ అవుతుంది.

ఆ సమయంలో మహిళల శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి.

హార్మోన్స్ సమస్యలు, జుట్టు రాలిపోవడం, గుండె జబ్బులు లాంటి ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి.

అయితే ఆ సమయంలో వచ్చే సమస్యలకు చెక్ పెట్టాలంటే.. 30 ఏళ్ళ నుంచే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.

ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులను అలవాటు చేసుకోవాలి.

ఆకు కూరలు, కూరగాయలు, చేపలు, గుడ్లు, లాంటి పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలి.

అలాగే, అధిక చెక్కర, ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని పూర్తిగా మానేయాలి.

ఇక మరొక ముఖ్యమైన విషయం బరువు నియంత్రణ.

మెనోపాజ్ తర్వాత..  హార్మోన్స్ లో  అనేక మార్పులు వస్తాయి. దీని వలన బరువు పెరుగుతారు.

దాని వలన మధుమేహం, అధిక రక్తపోటు వంటి అనేక సమస్యలు రావొచ్చు

కాబట్టి ముందు నుంచే శారీరక వ్యాయామం లాంటివి చేస్తూ ఉండాలి.

దీని వలన మెనోపాజ్ సమయంలో వచ్చే సమస్యలను తగ్గించడానికి వీలవుతుందని నిపుణులు చెబుతున్నారు

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం