మీ అరచేతులకు తరచూ  చెమటలు పడుతున్నాయా! అయితే, ఇది చాలా ప్రమాదం 

కొందరికి ఎలాంటి శారీరక శ్రమ లేకుండానే అరచేతులు చెమటలు పడుతుంటాయి.

 అయితే, ఈ సమస్యను అంత తేలికగా కొట్టిపడేయడానికి లేదు. 

నిపుణులు తెలిపిన దాని ప్రకారం ఇలా అరచేతులకు తరచూ చెమటలు పట్టడం కాలేయ సమస్యకు సంకేతం. 

ఇలా ఎవరికైనా అవుతున్నట్లైతే ..  వారు వెంటనే  డాక్టర్ చికిత్స తీసుకోవడం చాలా అవసరం. 

ఈ సమస్యను నియంత్రించే..  సేబాషియస్ గ్రంథులను నియంత్రించేందుకు వైద్యులు మందులు సూచిస్తారు.

ఒకవేళ దీనిని అశ్రద్ధ చేస్తే  లివర్ సిర్రోసిస్, లివర్ ఫెయిల్యూర్‌కు దారి తీస్తుందని.. నిపుణులు సూచిస్తున్నారు. 

దీనికి ప్రధాన కారణం తప్పుడు ఆహార అలవాట్లు, పెరుగుతున్న బరువు. 

 కాబట్టి , డైట్‌ను కంట్రోల్ చేయడం ద్వారా ఫ్యాటీ లివర్ సమస్యను అదుపులో ఉంచుకోవచ్చని డాక్టర్స్ చెబుతున్నారు. 

ముందుగా ఆహారంలో ఉప్పు వాడకాన్ని తగ్గించాలి. 

 అలాగే  ప్రతిరోజూ వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. 

అయినా సరే ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లైతే వెంటనే వైద్యులను సంప్రదించాలి.