వేప ఆకుతో వేల లాభాలు మీ సొంతం..!

వేప రుచి చేదుగా ఉన్నా.. దాని వలన సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. 

వేప బెరడు, ఆకులు, పువ్వులు, గింజలు, నూనె ఇలా అన్నీ మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. 

ఇక వేప పుల్లలో ఉన్న గుణాలలు దంతాలకు బలాన్ని చేకూరుస్తాయి.

అలాగే శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి,వేప ఆకులను ఉదయాన్నే నమిలితే మంచిది. 

వేపలో విటమిన్ సి,  ఇ, యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.

మొటిమలు, తామర వంటి చర్మ సమస్యలను కూడా వేప ద్వారా నివారించుకోవచ్చు. 

తాజా వేప ఆకులను మెత్తగా నూరి అందులో తేనె కలుపుకుని రోజూ తింటే అనేక రోగాలు దూరమవుతాయి. 

పైగా , వేపలో ఫ్లేవనాయిడ్స్ వంటి రసాయనాలు ఉంటాయి. 

ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని వేగంగా తగ్గిస్తాయి. 

అయితే, అధిక వేప కూడా ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని గుర్తుంచుకోవాలి.