‘బబుల్ గమ్’ మూవీ రివ్యూ!

ప్రముఖ టాలీవుడ్‌ యాంకర్‌ సుమ కుమారుడు హీరోగా తెరకెక్కిన చిత్రం ‘బబుల్‌గమ్‌’.

ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

రవికాంత్ పేరేపు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 

మరి, సుమ కుమారుడి మొదటి సినిమా ఎలా ఉంది? ప్రేక్షకుల్ని మెప్పించిందా? లేదా?

కథ : ప్రేమ, పెళ్లి అంటే నచ్చని జాను ( మానస చౌదరి).. ఆది ( రోషన్ కనకాల) ప్రేమలో పడుతుంది.

రెండు వేరువేరు నేపథ్యాలు కలిగిన వీరి ప్రేమ చివరికి ఎలాంటి మలుపు తీసుకుంది? అన్నదే మిగిలిన కథ.

కథలో కొత్త దనం ఏమీ కనిపించలేదు. ఫస్ట్‌ హాఫ్‌ ఎంగేజింగ్‌గా ఉండదు.

లస్ట్ తప్ప ఎలాంటి ఎమోషన్ లేకుండా సాగిపోయే లవ్ ట్రాక్ అని చెప్పొచ్చు.

హీరోయిన్‌ క్యారెక్టర్‌ సెకండ్‌ హాఫ్‌లో బాగా ఎలివేట్‌ అయింది.

ఫస్ట్‌ హాఫ్‌తో పోల్చుకుంటే సెకండ్‌ హాఫ్‌ బాగుంది.

సినిమాకు ఫీల్ గుడ్ టచ్ ఇవ్వడంలో  దర్శకుడు సక్సెస్ అయ్యాడు.

సినిమాలో హీరో, హీరోయిన్‌ నటన బాగుంది.

మిగిలిన వారంతా తమ పరిధికి తగ్గట్టు నటించారు.

శ్రీ చరణ పాకాల అందించిన బీజీఎం అదిరిపోయింది.

ప్లస్: రోషన్ కనకాల నటన మానస చౌదరి అందం సెకండ్ హాఫ్ హీరో ఫాథర్ క్యారెక్టర్

మైనస్: వీక్ రైటింగ్ ఫస్ట్ హాఫ్ స్లో స్క్రీన్ ప్లే

రేటింగ్ : 2.25