షుగర్ పేషెంట్స్ పొరపాటున కూడా ఈ 4 పండ్లు తినద్దు!

 షుగర్ వ్యాధి ప్రస్తుతం ఎంతో మందిని కంగారు పెట్టేస్తోంది.

వయసుతో సంబంధం లేకుండా ఎంతో మంది మధుమేహం బారిన పడుతున్నారు.

కొందరికి ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వల్ల షుగర్ వ్యాధి వస్తోంది.

ఇంకొందరికి మాత్రం వారసత్వంగా ఈ చక్కెర వ్యాధి వస్తోంది.

అయితే ఒకసారి షుగర్ వ్యాధి వచ్చిన తర్వాత నియంత్రణలో ఉంచుకోవడమే మన చేతుల్లో ఉంది.

సరైన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ వల్ల కూడా ఈ షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయచ్చు

కాకపోతే షుగర్ వచ్చిన తర్వాత కొన్ని తినకూడని పండ్లు ఉంటాయి. వాటి జోలికి పో కూడదు.

షుగర్ వ్యాధి వచ్చిన వాళ్లు సమ్మర్ కదా అని మామిడికాయలు తినేయకండి.

చక్కెర వ్యాధికి మామిడికాయ శత్రువు లాంటిది. దానికి జోలికి పోవద్దు.

అలాగే ఇప్పుడు లిచీ పండ్లు విరివిగా దొరుకుతాయి.

రోడ్లపై కనిపిస్తున్నాయని కొనుక్కుని తినేయకండి. అవి షుగర్ వ్యాధిని పెంచేస్తాయి

అలాగే ద్రాక్ష పండ్లు కూడా మీ రక్తంలో చక్కెర శతాన్ని పెంచేస్తాయి

అందరికీ తెలిసిందే.. షుగర్ వస్తే అరటిపండు అసలు తినకండి

 షుగర్ వ్యాధి ఉన్న వాళ్లు యాపిల్, కమల, కివీ, జామకాయలను తినచ్చు. అది కూడా లిమిట్ లో ఉంటే మంచిది.

గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం అందించింది మాత్రమే. షుగర్ వ్యాధికి సంబంధించి వైద్యులను సంప్రదిస్తే మంచిది.