థైరాయిడ్ తో బాధ పడుతున్నారా? సమ్మర్లో ఈ ఫ్రూట్స్ తప్పక తినండి!

థైరాయిడ్ అనేది చాపకింద నీరులా ఇబ్బంది పెట్టే సమస్య

ఇది ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా కనపిస్తూ ఉంటుంది.

దీనిలో హైపర్ థైరాయిడ్ అని కూడా ఉంటుంది.

దాని లక్షణాలు చూస్తే.. ఆకలి ఎక్కువ అవ్వడం, చెమటలు పట్టడం, సిత్థిమితం లేకపోవడం, నిద్రలేమి, నీరసం వస్తుంది.

ముఖ్యంగా సమ్మర్ లో థైరాయిడ్ ఇంకా చికాకు పెట్టే సమస్య ఉంటుంది.

థైరాయిడ్ సమస్యను మంచి ఆహారపు అలవాట్లతో కంట్రోల్ చేసుకోవచ్చు.

 సమ్మర్ లో కొన్ని ఫ్రూట్స్ ని రెగ్యులర్ గా తినడం వల్ల థైరాయిడ్ సమస్యకు చెక్ పెట్టచ్చు.

థైరాయిడ్ ఉన్న వాళ్లు రోజుకో యాపిల్ తింటే మంచిగా ఉంటుంది.

యాపిల్స్ లో ఉండే మినరల్స్, ఫైబర్స్, విటమిన్స్.. ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తుంది.

థైరాయిడ్ ఉన్న వాళ్లు ఆవకాడోని కూడా రెగ్యులర్ గా తినడం మంచిది.

ఆవకాడోలో ఉండే.. విటమిన్ కే, సీ, ఈ, బి5, బి6, పొటాషియం, ఫొలేట్ థైరాయిడ్ గ్రంధిని ఆరోగ్యంగా ఉంచుతాయి.

బెర్రీస్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ థైరాయిడ్ సమస్యను అదుపులో ఉంచుతుంది.

రోజుకో అరటి పండు తినడం కూడా థైరాయిడ్ సమస్యను కంట్రోల్ లో ఉంచుతుంది.

 అంజీర్, ఖర్జూరం వంటివి కూడా థైరాయిడ్ ను బ్యాలెన్స్ చేస్తాయి.

గమనిక: ఇవన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే.. థైరాయిడ్ సమస్య ఎక్కువైతే వైద్యులను సంప్రదించండి.