చలికాలంలో ఇమ్యూనిటీ పెంచే ఆహార పదార్థాలు ఇవే..

సాధారణంగా వాతావరణ మార్పు రోగ నిరోధక వ్యవస్థపై ప్రభావం చూపుతాయి.

ముఖ్యంగా చలికాలంలో రోగనిధోక శక్తి తగ్గిపోవడం అనేది జరుగుతుంది.

సూర్యరశ్మి, ఎండ ప్రభావం తక్కువగా ఉండటం వల్ల రోగ నిరోధక వ్యవస్థ బలహీనత పడుతుంది.

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రతీ ఒక్కరం ఆరోగ్యంగా ఉండటానికి ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలి.

శీతకాలంలో రోగ నిరోధకతను పెంచే కొన్ని ఆహార పదార్థాలను మనం ఇప్పుడు చూద్దాం..

చలికాలంలో జలుబు, ఫ్లూతో పోరాడేందుకు సిట్రస్ పండ్లు చాలా సహాయపడతాయి.

సిట్రస్ ఉండే విటమిన్ సీ శరీరంలోని తెల్ల రక్తకణాల సంఖ్యను పెంచుతాయి.

కేవలం వంటకు మంచి రుచి అందించడమే కాకుండా వెల్లుల్లిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి.

రక్త ప్రసరణ తగ్గించడం, జీర్ణవ్యవస్థను పెంచడానికి వెల్లుల్లి ఎంతగానో తోడ్పడుతుంది.

చలికాలంలో వచ్చే జలుబును నివారించేందుకు అల్లంను ఉపయోగించం మేలు.

శీతకాలంలో తీసుకునే ఆహారంలో అల్లం ఉండేలా చూసుకోవడం చాలా మంచిది.

చలికాలంలో బచ్చలికూరలో కూరను కూడా ఆహారంలో తీసుకోవడం మంచిది.

బచ్చల కూర శరీరం ఇన్ఫెక్షన్‌తో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతుంది.

గ్రీన్ కాలీఫ్లవర్‌ పుష్కలంగా సీ విటమిన్ లభిస్తుంది.

గ్రీన్ కాలీఫ్లవర్‌ ఉండే హై ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

ఇవే కాక మరికొన్ని పదార్థాలు తీసుకోవడం ద్వారా చలికాలంలో ఇమ్యూనిటీ పెంచుకోవచ్చు.