వర్షంలో తడిచిన బట్టలతో ఎక్కువ సేపు ఉంటున్నారా? పెద్ద తప్పు చేస్తున్నారు!

Arrow

ప్రస్తుతం వర్షకాలం కావడంతో.. ఎక్కడ చూసిన విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

Arrow

ఇక ఈ వర్షాల కారణంగా ఆఫీసు, స్కూల్స్, బయట పనులకు వెళ్లే వారు తడిచే అవకాశం ఉంటుంది.

Arrow

అలాగే మరి కొందరికి  కావాలనే వర్షంలో తడవాలని కోరిక ఉంటుంది.

Arrow

ఇలా ఏ విధంగానైనా వర్షంలో తడిచిన వారు ఎక్కువ సమయం తడిచే బట్టలతో ఉండటం చాలా ప్రమాదం అని ఎవరికైనా తెలుసా

Arrow

మరి తడిచిన బట్టల్లో గంటల తరబడి ఉంటే చాలా డేంజర్ అని  వైద్య నిపుణులు చెబుతున్నారు.మరి ఆ విషయాలేంటో తెలుసుకుందాం.

Arrow

చాలామంది తడిచిన బట్టలను మార్చుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇలా చేయడం వలన అనేక రోగాల బారిన పడే అవకాశం ఉంది.

Arrow

అయితే ఈ తడిచిన బట్టల్లోనే ఎక్కువ సమయం ఉండటం వలన చలి జ్వరం, దగ్గు, జలుబు వంటివి వ్యాపిస్తాయి.

Arrow

ముఖ్యంగా తడిచిన బట్టల్లో ఎక్కువ సమయం ఉండటం వలన చర్మంపై బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ వంటివి పేరుకుపోయే ప్రమాదం ఉంటుంది.

Arrow

దీని వలన చర్మం అలర్జీ,ఇన్ఫెక్షన్ కు గురయ్యే అవకాశం ఎక్కువగా  ఉంటుంది.

Arrow

అంతేకాకుండా.. ఇలా తడిచి బట్టల్లో ఉండటం వలన వివిధ రోగాల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Arrow

దీంతో అనేక ఇన్ఫెక్షన్లకు గురయ్యి హాస్పటిల్ లో వేలకు వేలు డబ్బుల ఖర్చు చేసే పరిస్థితి వస్తుంది.

Arrow

పైగా ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి ఒకరి నుంచి మరొకరికి ఇంట్లో సోకో ప్రమాదం కూడా ఉందని వైద్యులు చెబుతున్నారు.

Arrow

అందువల్ల ఎక్కువ సమయం తడి బట్టలతో  ఉండకుండా తగు జాగ్రత్తాలు తీసుకోవడం చాలా మంచిదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.