Tooltip

బచ్చలి కూర.. ఈ ఒక్కటి తింటే లైఫ్ లో ఆస్పత్రికి పోవాల్సిన అవసరం లేదు

మనం తినే ఆకు కూరల్లో ఎన్నో రకాల పోషకాలు, విటమిన్లు ఉంటాయి.

బచ్చలి కూరలో విటమిన్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.

ఈ ఆకు కూరతో పప్పు, కర్రీ, సలాడ్ లో వాడవొచ్చు. ఏ విధంగా తీసుకున్నా పోషకాలు అందుతాయి.

బచ్చలి కూరలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల దీర్ఘకాలిక రోగాల నుంచి విముక్తి కలుగుతుంది.

ఈ ఆకు కూర తినడం వల్ల అధిక రక్తపోటు ఉన్నవాళ్లకు మేలు కలుగుతుంది.

బచ్చలి కూరలో సెలీనియం, నియాసిన్, ఒమేగా 3 ఉంటాయి. ఊపిరి తిత్తులకు మంచిది.

ఈ ఆకు కూరలో ఉండే సాఫోనిన్ అనే పదార్థం క్యాన్సర్ భారిన పడకుండా చేస్తుంది.

రోజూ బచ్చల కూర కషాయాన్ని తీసుకుంటే.. మూత్ర విసర్జన లో వచ్చే సమస్యలు తగ్గుతాయి.

బచ్చల కూర తింటే శరీరంలో అదనంగా పేరుకు పోయిన కొలెస్ట్రాల్ ని కరిగిస్తుంది.

బచ్చలి కూరలో ఉండే కాల్షియం ఎముకులను ధృడంగా ఉంచుతుంది.

వేసవి కాలంలో బచ్చలి కూర తింటే మంచి ఆరోగ్యంతో పాటు శరీరానికి చలువు చేస్తుందని అంటున్నారు.

ఈ ఆకు కూర తింటే ఫైల్స్, కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పుల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. 

బచ్చల కూర తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నాడీ సంబంధిత వ్యాధుల నుంచి రక్షిస్తుంది.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం