ఉసిరి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..!

ఉసిరిని సంస్కృతంలో ఆమ్లా, ధాత్రి ఫలం అని పిలుస్తారు.. ఇదో గొప్ప ఔషద గని.

ఉసిరి చెట్టులో వేరు నుంచి చిగురు వరకు ఎన్ని భాగాలు ఔషదాలుగా పనిచేస్తాయి.

ఉసిరి చెట్టులోని అన్ని భాగాలు ఎక్కువగా ఆయుర్వేద వైద్యానికి ఉపయోగిస్తారు.

ఉసిరిలో విలమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, పీచు, కాల్షియం, ఐరన్, పాస్ఫరస్, పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి

ఉసిరిలో ఉండే విటమిన్లు శరీర రోగ నిరోదక శక్తిని పెంచి మంచి ఆరోగ్యాన్ని అందంచి.. అవయవాలు బాగా పనిచేసేలా చేస్తుంది.

ఫ్లూ, జ్వరం ఇతర అనారోగ్య సమస్యలను నివారించడానికి చక్కగా పనిచేస్తుంది.

భోజనం చేసిన తర్వాత ఉసిరి తీసుకుంటే జీర్ణక్రియను పెంచుతుంది.. దీంతో ఆహారం చక్కగా జీర్ణమవుతుంది.

ఉసిరి రోజూ తింటే మలమద్దకం సమ్యలు మటమాయం అవుతాయి. ఇందులో ఉండే పీచు పదార్థం ఆకలిని బాగా పెంచుతుంది.

ఉసిరి పచ్చడ, జ్యూస్, ఎండబెట్టి ఇలా ఎన్నో రకాలుగా తీసుకుంటారు. శరీర కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేసి బరువు తగ్గిస్తుంది.

ఉసిరిలో యాంటీమైక్రోబియల్, యాంటీ వైరల్ గుణాల వల్ల రక్త ప్రసరన మెరుగుపడుతుంది.

డయాబెటీస్ ఉన్న వారు ఉసిరి తింటే రక్తంలోని చక్కెర లెవెల్స్ ని తగ్గిస్తుంది. 

ఉసిరి పొడిని నీళ్లతో తాగితే.. తరుచూ వచ్చే దగ్గు, రొంప నుంచి విముక్తి లభిస్తుంది.

అలర్జీ, ఆస్తమా దీర్ఘకాలిక గొంతు ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది.