రూ.5 కొత్తిమీరతో ఇన్ని ప్రయోజనాలా? అస్సలు నమ్మలేరు!

సాధారణంగా  కొత్తిమీరను వంటలలో సువాసన, రుచి కోసం ఉపయోగిస్తూ ఉంటారు.

అయితే  అవి మాత్రమే కాకుండా వీటి వలన ఇంకా ఎన్నో  రకాల  లాభాలు ఉన్నాయన్న సంగతి తెలుసా

ముఖ్యంగా కొత్తిమీర నీటితో అనేక రకాల లాభాలు ఉన్నాయి.

కొత్తిమీర నీరు  ఎసిడిటీ సమస్యను తగ్గించడానికి ఎంతో మేలు చేస్తుంది.

అలాగే బరువు నియంత్రణలోనూ, బరువు తగ్గాలి అనుకునే వారికి  కూడా ఈ నీరు  ఎంతో మేలు చేస్తుంది.

మలబద్దకం సమస్యను దూరం చేయడానికి కూడా  కొత్తి మీరా నీరు ఉపయోగపడుతుంది.

అంతేకాకుండా థైరాయిడ్ సమస్యలను  నివారించేందుకు కూడా ఇది  పనిచేస్తుంది.

పచ్చి కొత్తిమీరలో ప్రోటీన్,  ఫైబర్,కొవ్వు, కార్బోహైడ్రేట్, ఫాస్పరస్, ఐరన్,కాల్షియం లాంటి పోషకాలు అధికంగా  ఉంటాయి.

హై  బీపీ ఉన్నవారు కొత్తిమీర సలాడ్ తీసుకోవడం చాలా మంచిది.

కంటి చూపు సమస్యలకు చెక్ పెట్టేందుకు కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది.

ఎముకలు బలంగా, దృడంగా తయారయ్యేందుకు ఇది ఎంతో సహాయపడుతుంది.

 అంతే కాకూండా ముఖ్యంగా స్త్రీలలో పీరియడ్స్ సమయంలో తిమ్మిర్లు తగ్గిస్తుంది.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం