జ్వరం రావడం వల్ల ఇన్ని లాభాలా.. సంచలన నిజాలు!

వర్షాకాలం అంటేనే వ్యాధుల సీజన్‌. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. వైరల్‌ ఫీవర్‌ బారిన పడాల్సి వస్తుంది.

జ్వరం వస్తే శారీరకంగానే కాక మానసికంగా కూడా ఇబ్బందే.

అయితే ఇలా అప్పుడప్పుడు జ్వరం రావడం మంచిదే అంటునున్నారు నిపుణులు.

ఇది శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది అంటున్నారు.

 జ్వరం రావడం వల్ల భవిష్యత్తులో వచ్చే రోగాల బారి నుంచి కూడా తప్పించుకోవచ్చని తాజా సర్వే వెల్లడించింది.

అప్పుడప్పుడు జ్వరం రావడం శరీరానికి మంచిదని టాక్సీకాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ అధ్యయనం పేర్కొంది.

తరచుగా జ్వరం రావడం వల్ల.. ఏ సూక్ష్మజీవి ఎలాంటి ప్రమాదాన్ని కలిగిస్తుంది..

దాన్ని ఎలా ఎదుర్కోవాలనే అంశం మన రోగ నిరోధక వ్యవస్థకు అలవాటవుతుంది.

మళ్లీ ఆ వ్యాధుల బారిన పడితే.. సులభంగా ఎదుర్కొంటుందని ఎక్స్‌పరిమెంటల్‌ అధ్యాయనం వెల్లడించింది.

జ్వరం రావడం వల్ల శరీర  ఉష్ణోగ్రత పెరిగి జీవక్రియ రేటు పెరుగుతుంది.

అంటే చెమట పట్టడం, మల, మూత్ర విసర్జన లాంటివి ఎక్కువ జరుగుతాయి.

దాని వల్ల శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను బయటకు వెళ్తాయి.

బాడీలో వేడి పెరిగితే సూక్ష్మ క్రిముల వృత్తిని నిలుపుదల చేయడమే కాకుండా ఇమ్యూన్ సెల్స్ యాక్టివిటీని పెంచుతుంది.

ఇది యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ అణువులను శరీరంలోకి విడుదల చేస్తుంది.

కనుక తరచుగా జ్వరం వస్తే భయపడాల్సిన అవసరం లేదు అంటున్నారు.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం