సిగరెట్ తాగుతున్నారా? ఐతే పురుషాంగానికీ క్యాన్సర్ తప్పదు!

రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ అని క్యాన్సర్ లో రకాలు ఉన్నట్టే పురుషాంగానికి కూడా క్యాన్సర్ వస్తుందట.

ఇది మగవారిలో చాలా సాధారణంగా వస్తున్న రోగం అని నిపుణులు చెబుతున్నారు.

హెచ్పీవీ ఇన్ఫెక్షన్ వల్ల, పరిశుభ్రంగా లేకపోవడం వల్ల పురుషాంగం క్యాన్సర్ వస్తుందని చెబుతున్నారు.

సున్తీ చేసుకున్న వారితో పోలిస్తే మిగతావారికి ఈ క్యాన్సర్ ముప్పు ఎక్కువ ఉందంటున్నారు.

సిగరెట్ తాగడం వల్ల, పొగాకు ఉత్పత్తులు వాడడం వల్ల వచ్చే క్యాన్సర్ తో పాటు ఈ క్యాన్సర్ కూడా వస్తుందని చెబుతున్నారు.

అయితే ఇది 50 ఏళ్ళు పైబడిన వయసు వారికి ఎక్కువగా వస్తుంది.

పురుషాంగం మీద గడ్డలు వచ్చినా, పెరిగినా అది క్యాన్సర్ కి కారణమవుతుంది.  

పురుషాంగ చర్మం రంగు మారుతుంది. లేదా మందంగా తయారవుతుంది.

తరచూ పుండ్లు, పూతలు వస్తున్నా.. లేదా ప్రమేయం లేకుండా పురుషాంగం నుంచి ద్రవం వస్తున్నా, రక్తస్రావం అవుతున్నా క్యాన్సర్ కి కారణమవుతుంది.  

మూత్ర విసర్జన టైంలో, సంభోగ సమయంలో పురుషాంగం నొప్పిగా ఉన్నా, అసౌకర్యంగా ఉంటే నిర్లక్ష్యం చేయకూడదు. డాక్టర్ ని సంప్రదించాలి.   

గజ్జ ప్రాంతంలో శోషరస కణుపుల్లో వాపు ఉంటే క్యాన్సర్ వ్యాప్తికి కారణం.

ఈ లక్షణాలు కనబడితే డాక్టర్ ని సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.