రాత్రి 2 దాటినా నిద్ర రావడం లేదా? ఇలా చేస్తే ఈజీగా నిద్రపట్టుద్ది!

నిద్రలేమి అనేది ఈ రోజుల్లో సాధారణ ఆరోగ్య సమస్యగా మారింది. హెల్త్ స్టైల్ డిసీజెస్ లో ఇదీ ఒకటని చెప్పొచ్చు.

ఈ రోజుల్లో చాలా మందికి రాత్రి ఒంటిగంట, 2 దాటినా నిద్రపట్టదు. సరైన నిద్ర లేకపోవడంతో అనేక మంది సతమతమవుతున్నారు.

నిద్రలేమి వల్ల మధుమేహం, ఊబకాయం, డిప్రెషన్, యాంగ్జయిటీ లాంటి మానసిక రోగాల బారిన పడే ప్రమాదం ఉంది.

నిద్రలేమి సమస్య నుంచి బయటపడేందుకు నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. ఇవి పాటిస్తే భేషుగ్గా పడుకోవచ్చని అంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

 మహిళల్లో మెనోపాజ్ హాట్ ఫ్లషెస్ సమస్య ఉన్నప్పుడు.. అలాగే శరీరంలో అధిక ఉష్ణోగ్రత ఉన్నా నిద్ర పట్టదు. దీని నుంచి బయట పడాలంటే ఎడమ ముక్కు రంధ్రం నుంచి శ్వాస తీసుకోవాలి.

ఎడమ వైపు పడుకొని చేతి వేలితో కుడి ముక్కు రంధ్రాన్ని మూయాలి. ఆ తర్వాత ఎడమ ముక్కు రంధ్రంతో మెళ్లిగా శ్వాస తీసుకోవాలి.

కండరాలకు రెస్ట్ ఉంటే నిద్ర బాగా పడుతుంది. అందుకోసం వెల్లకిలా పడుకొని ముక్కు ద్వారా మెళ్లిగా శ్వాస తీసుకోవాలి. శ్వాస తీసుకునే టైమ్ లో కాలి బొటనవేళ్లను కిందకు అదిమి యథాస్థితిలో ఉంచాలి.

నిద్ర బాగా పట్టాలంటే స్లీప్ పారడాక్స్ అనే పద్ధతిని అనుసరించొచ్చు. కళ్లను విప్పార్చి నిద్ర పట్టడం లేదని పదే పదే మనసులో అనుకుంటూ ఉండాలి.

నిద్ర కోసం సరైన ఆహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తింటూ ఉండాలి.

పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలను తీసుకోవడం తగ్గించాలి. పుల్లటి పెరుగు తీసుకోవడం నిద్రకు ఉపక్రమించేందుకు ఉపయోగపడుతుంది.

ఈవెనింగ్ తర్వాత టీ, కాఫీలు తాగకూడదు. వీటిల్లో ఉండే కెఫీన్ శక్తిని పెంచుతుంది. దీంతో తేలికగా నిద్రపట్టదు.

రోజూ ఒకే టైమ్ కు పడుకోవడం అలవాటు చేసుకోవాలి. అలాగే మొబైల్ ఫోన్స్ ను నిద్రపోయే ముందు వాడటం మానేయాలి.

మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. డిప్రెషన్ లాంటి సమస్యలు ఉంటే డాక్టర్స్ హెల్ప్ తీసుకోవాలి.

మొత్తంగా చెప్పాలంటే నిద్రలేమి సహజంగానే తొలగిపోతుంది. సరైన ఆరోగ్య శైలి, మంచి ఆహారం, హెల్తీ హాబీస్ ద్వారా దీని నుంచి వేగంగా బయటపడొచ్చు.

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం