కూర్చోవడం, నిల్చోవడం, నడవడం.. రోజులో దేనికి ఎంత సమయం కేటాయించాలంటే!

iDreampost.Com

మనిషి తన జీవితంలో రోజు చేసే పనులంటే కూర్చోవడం, నిల్చోవడం, నడవడం.

iDreampost.Com

ఈ మూడు లేకుండా ఏ పని సాగదు.

iDreampost.Com

వీటితో పాటు ఆఖరుగా చేసే పని పడుకుని నిద్ర పోవడం.

iDreampost.Com

నిద్ర సంగతి పక్కకు పెడితే మిగతా మూడు పనుల మధ్య సమతుల్యత ఉండాలి అంటున్నారు నిపుణులు.

iDreampost.Com

మెరుగైన ఆరోగ్యం కోసం ఎక్కువ సమయం నిలబడటం, కూర్చోవడం తర్వాత రెస్ట్‌ ఉండాలంటున్నారు.

iDreampost.Com

ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజంతా కూర్చోవడం వల్ల గుండె, టైప్ 2 డయాబెటిస్‌, క్యాన్సర్ వంటి జబ్బుల వచ్చే అవకాశం ఉంది.

iDreampost.Com

రోజూ 4 గంటల కంటే తక్కువ సమయం కూర్చునేవారికి సమస్యలు తక్కువగా వస్తాయని నివేదికలు చెబుతున్నాయి.

iDreampost.Com

ఇక నిల్చోవడం విషయానికి వస్తే..

iDreampost.Com

రోజుకు కనీసం 2 గంటలు నిలబడితే మంచిదని.. 4 గంటలైతే మరీ మంచిదని చెబుతున్నారు.

iDreampost.Com

నిలబడటం అంటే పూర్తిగా నిలబడి ఉండటం కాదు.

iDreampost.Com

రోజు మొత్తం మీద వాకింగ్ సమయంలోనో పనులు చేసుకునేటప్పుడో నిలబడి చేసుకోవచ్చు అంటున్నారు.

iDreampost.Com

నడక విషయానికి వస్తే.. రోజుకు 30 నిమిషాల చొప్పున వారానికి ఐదు రోజులైనా నడవాలి అంటున్నారు నిపుణులు.

iDreampost.Com

వాకింగ్‌ కోసం అడుగుల సంఖ్య, సమయం మాత్రమే కాక.. దూరాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని చెబుతున్నారు.

iDreampost.Com

అప్పుడే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయంటున్నారు.

iDreampost.Com

కనీసం రోజుకు కిలోమీటర్‌ అయినా నడవాలి అంటున్నారు.

iDreampost.Com

ఎక్కువ సేపు నడక, నిలబడటం కష్టం కావచ్చు. కానీ అవే మీ ఆరోగ్యాన్ని కాపాడతాయని గుర్తు పెట్టుకొండి.

iDreampost.Com