సింపుల్ చిట్కాలు.. పొట్ట వెన్నపూసలా కరిగిపోతుంది..

మారుతున్న జీవన విధానం వల్ల చిన్న వయసులోనే పొట్ట వచ్చేస్తోంది.

పొట్ట రావడానికి పలు కారణాలు ఉంటాయి. మీ ఉద్యోగం కూడా ఒక కారణం కావచ్చు

పొట్ట రాకముందే జాగ్రత్తలు తీసుకోవాలి.. వచ్చాక ముప్పతిప్పలు పెట్టేస్తుంది.

మీరు ఇప్పటికే పొట్ట తగ్గించేందుకు చాలా ప్రయత్నాలు చేసి విసిగిపోయి ఉంటారు.

 ఈ సింపుల్ చిట్కాలు మీరు క్రమం తప్పకుండా పాటిస్తే.. పొట్ట వెన్నపూసలా కరిగిపోతుంది.

ముఖ్యంగా ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి.

జంక్ ఫుడ్ కి నో చెప్పండి. ట్రాన్స్ ఫ్యాట్స్ ఎంతో ప్రమాదకరమైనవి.

ఆహారంలో ప్రొటీన్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి. మంచినీళ్లు ఎక్కువ తాగండి.

ప్రొటీన్ వల్ల కడుపు నిండుగా ఉండి ఆకలి తగ్గిపోతుంది. పొట్ట తగ్గడానికి ఉపయోగంగా ఉంటుంది.

ఫైబర్ ఎక్కువగా ఉండే పండ్లు, ఓట్స్, పప్పులు, కూరగాయలను ఎక్కువగా తినండి.

పంచదార, స్వీట్స్, చక్కెర పదార్థాలకు దూరంగా ఉంటే మంచిది.

ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్, సాల్టెడ్ ఆహారం తీసుకోవడం మానేయండి.

 మీరు తినే ఆహారం మాత్రమే కాదు.. ఒత్తిడి కూడా బరువు పెరగడానికి కారణం.

మద్యపానం, ధూమపానం అలవాట్లకు దూరంగా ఉంటే మంచిది.

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. మీరు ఏదైనా డైట్ ఫాలో అవ్వాలి అనుకుంటే సర్టిఫైడ్ న్యూట్రీషియన్స్ ని సంప్రదిస్తే మంచిది.