మూడో పెళ్లి చేసుకున్న షోయబ్‌ మాలిక్‌

పాకిస్థాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ మూడో పెళ్లి చేసుకున్నాడు.

గతంలో భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జాను నిఖా చేసుకున్న మాలిక్‌.. ఆమెతో కొంతకాలంగా దూరంగా ఉన్నంటున్నట్లు వార్తలు వచ్చాయి.

కానీ, వాళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారనే విషయం మాత్రం బయటికి రాలేదు.

వారిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని, విడాకులు తీసుకునేందుకు సిద్ధం అవుతున్నరని కూడా మీడియాలో బాగా ప్రచారం జరిగింది.

అయితే.. విడాకులపై అటు మాలిక్‌ కానీ, ఇటు సానియా కానీ ఎప్పుడూ అధికారికంగా స్పందించలేదు.

ఇప్పుడు తాజాగా షోయబ్‌ మాలిక్‌ పాకిస్థాన్‌ నటి సనా జావెద్‌ను నిఖా చేసుకున్నాడు.

తన పెళ్లికి సంబంధించిన ఫొటోలను మాలిక్‌ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ.. అల్‌హమ్మదులిల్లా అంటూ పేర్కొన్నాడు.

అయితే.. సానియా-మాలిక్‌ విడాకులు తీసుకున్నారా? లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు.

ఏది ఏమైనా.. షోయబ్‌ మాలిక్‌ మరో పెళ్లి చేసుకోవడం మాత్రం సంచలనంగా మారింది.

అయితే.. షోయబ్‌ మాలిక్‌-సానియా దంపతులకు ఒక కుమారుడు ఉన్న విషయం తెలిసిందే.

ఆ పిల్లాడు చాలా కాలంగా తల్లి సానియా వద్దే పెరుగుతున్నాడు.

సానియాను పెళ్లి చేసుకోవడానికి ముందే.. మాలిక్‌ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.

ఆ తర్వాత సానియాను రెండో వివాహం చేసుకున్నాడు.