శిరీష్‌ భరద్వాజ మృతి.. కారణమిదే

చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ మాజీ భర్త శిరీష్‌ భరద్వాజ్‌ మృతి చెందాడు.

కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న భరద్వాజ్‌.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.

భరద్వాజ్‌ గత కొంత కాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నాడు.

ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. బుధవారం ఉదయం కన్ను మూశాడు.

అయితే దీనిపై అతడి కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

గతంలో శిరీష్‌ శ్రీజను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

2007లో వీరిద్దరూ గుడిలో పెళ్లి చేసుకున్నారు.

అయితే మనస్పర్థలు రావడంతో విడిపోయారు.

2014లో శ్రీజ-శిరీష్‌ ఇద్దరూ విడిపోయారు. .

 వీరికి ఒక కుమార్తె సంతానం ఉంది. .

శిరీష్ భరద్వాజ్ 2019లో మరో వివాహం చేసుకున్నాడు.

శ్రీజతో విడాకుల తర్వాత భరద్వాజ్‌.. డాక్టర్‌ విహనను రెండో పెళ్లి చేసుకున్నాడు. .

ప్రస్తుతం వారు చెన్నైలో నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది.

శిరీష్‌ భరద్వాజ్‌ బీజేపీలో చేరి కొన్నాళ్ల పాటు రాజకీయాల్లో యాక్టీవ్‌గా ఉన్నాడు..