సలార్  OTT స్ట్రీమింగ్.. 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చిన సలార్ మూవీ గత ఏడాది డిసెంబర్ 22న రిలీజైన సంగతి తెలిసిందే.

ఈ హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

దేశమంతటా సలార్ మానియా కొనసాగింది. చాలా కాలం తర్వాత ప్రభాస్ కి సలార్ రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ దక్కింది. 

సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న ప్రభాస్ కి, ప్రభాస్ ఫ్యాన్స్ కి ఈ సినిమా ఫుల్ మీల్స్ అందించింది.

సలార్ మూవీలో ప్రభాస్ యాక్షన్, మాస్ ఎలివేషన్స్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించాయి. 

బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతూ సలార్ రికార్డులు క్రియేట్ చేసింది

ఏకంగా రూ. 700 కోట్లకు పైగా కలెక్షన్స్ ని క్రియేట్ చేసింది.

అలాంటి సలార్  మూవీని మళ్ళీ చూడాలనుకునేవారికి..  ఈ మూవీని చూడని వారికి గుడ్ న్యూస్.

ప్రముఖ ఓటీటీ సంస్థ  నెట్ ఫ్లిక్స్ సలార్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది.

ఈ నేపథ్యంలో అధికారికంగా స్ట్రీమింగ్ డేట్ ని వెల్లడించింది. 

జనవరి 20వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు నెట్ ఫ్లిక్స్ తెలిపింది.