‘కాటేరమ్మ కొడుకును పంపింది’ డైలాగ్ చెప్పిన అమ్మాయి ఎవరో తెలుసా..?

సలార్ సూపర్ సక్సెస్ తో అందులో నటీనటులు అందరికీ మంచి పేరు వస్తోంది.

సలార్ లో నటించిన చిన్నారి సయ్యద్ ఫర్జానా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

 ‘కాటేరమ్మ రాలేకపోయింది.. కానీ.. కాటేరమ్మ కొడుకును పంపింది’ అంటూ ఫర్జానా చెప్పిన డైలాగ్ అదిరిపోయింది.

ఈ సీన్ మొత్తం సినిమాని ఇంకో లెవల్ కి తీసుకెళ్లింది

మనల్ని కాపాడటానికి  దేవుళ్ళు ఎలాగో రారు అన్నావ్ కదా.. అందుకే రాక్షసుడు అయినా వస్తాడేమో అని మొక్కుతున్నా     ఈ డైలాగ్ కూడా అదిరిపోయింది. 

ఇలా సెకండాఫ్‌లో ఫర్జానా నటించిన సీన్స్  కంటతడి పెట్టిస్తుంటాయి.

ఫర్జానా చిన్నప్పటి నుండి చాలా యాడ్స్ లో నటించి పేరు తెచ్చుకుంది. 

ఝాన్సీ వెబ్ సిరీస్‌ ఈమెకి మంచి పేరు తెచ్చి పెట్టింది

ఫర్జానాకి ఆడిషన్స్ ద్వారా సలార్ చిత్రంలో నటించే అవకాశం వచ్చిందట

కళ్లు చూసి డైరెక్టర్ ప్రశాంత్ ఆమెని ఈ పాత్ర కోసం ఎంచుకున్నారట

ఫర్జానా ప్రస్తుతం 10వ తరగతి చదువుతోంది. 

ఇప్పటికే నితిన్ మూవీ కోసం ఆడిషన్ కూడా ఇచ్చిందట ఈ పాప. 

ఈమెకి సలార్ లో ప్రభాస్‌తో కలిసి ఒక సీన్ పెట్టారట. అయితే.., అది ఎడిటింగ్ లో పోయింది

ముందు షూటింగ్ సమయంలో ప్రభాస్‌తో చాలా అందంగా ఉన్నావని ఈ చిన్నారికి కాంప్లిమెంట్ ఇచ్చాడట

దర్శకుడు నీల్ సపోర్ట్ తోనే సలార్ లో బాగా నటించానని ఫర్జానా చెప్పుకొచ్చింది.