హీటర్‌తో కాచిన నీటితో.. పిల్లలకి స్నానం చేయించడం మంచిదా.. కాదా..?

గర్భం దాల్చిన నాటి నుంచి పిల్లలు జన్మించి.. వారికి ఎంతో జాగ్రత్తగా ఉండాలి.

అలాను పురిటి బిడ్డల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి.

ఇక బిడ్డకు జన్మనిచ్చిన నాటి నుంచి ఓ ఏడాది వయసు వచ్చే వరకు

వారికి సంబంధించిన అనేక విషయాల్లో ఎన్నో అనుమానాలు, భయాలు ఉండటం సహజం.

వీటిల్లో ప్రధానమైంది.. ఎక్కువగా వినిపించేది ఒకటి ఉంది.

అదే.. పిల్లలకు హీటర్‌తో కాచిన నీటితో స్నానం చేయించవచ్చా.. లేదా?

పల్లెల్లో దీనిపై అనేక అనుమానాలున్నాయి.

హీటర్‌తో కాచిన నీటితో స్నానం చేయిస్తే.. పిల్లలు నల్లగా అవుతారని..

వారి శారీరక ఎదుగుదల కూడా సరిగా ఉండదనే అభిప్రాయం నాటుకుపోయి ఉంది.

మరి ఇది నిజమేనా.. హీటర్‌తో కాచిన నీళ్లతో పిల్లలకు స్నానం చేయించకూడాదా

దీనిపై వైద్యులు, నిపుణులు ఏం అంటున్నారంటే..

కట్టెలపోయ్యి, గ్యాస్‌ స్టవ్‌, హీటర్‌ ఇలా దేని మీద కాచినా.. నీళ్లలో మార్పు రాదు అంటున్నారు.

హీటర్‌తో కాచిన నీటిని వాడితే.. పిల్లలు నల్లగా అవుతారనేది పూర్తిగా అవాస్తవం అన్నారు.

దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని చెబుతున్నారు.

కాకపోతే చాలా మంది పిల్లలకు బాగా వేడిగా నీటితో స్నానం చేయిస్తారని..

ఇది మంచి పద్దతి కాదని.. దాని వల్ల పిల్లల చర్మం కందిపోతుంది అంటున్నారు.

పిల్లలకు వేడి నీటితో స్నానం చేయించే ముందు.. పెద్దలు ఆ నీటిని మోచేయి మీద వేసుకుని పరీక్షించాలని..

మనం తట్టుకునే వేడి కన్నా మరి కాస్త తక్కువ హీట్‌ ఉన్న నీటితో చిన్నారులకు స్నానం చేయించాలని చెబుతున్నారు.